కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
- గదిలో గాలిని బంధిస్తే అక్కడక్కడే వైరస్ వ్యాప్తి
- వెంటిలేషన్ అనేది ఇప్పుడు సామాజిక రక్షణ వ్యవస్థ
- కరోనా రోగి నుంచి 10 మీటర్ల వరకు వైరస్
- రక్షణకు డబుల్ మాస్కు, భౌతిక దూరం తప్పనిసరి
- కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ, మే 20: కరోనా సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ తుంపర్లు ఆ వ్యక్తి నుంచి 10 మీటర్ల దాకా వ్యాపించవచ్చని కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. కరోనా సోకిన వ్యక్తి నుంచి 10 మీటర్ల దూరం వరకు వైరస్ గాల్లోనే ఉండవచ్చని, అందుకే భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించాలని సూచించింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకోండి. మహమ్మారిని అంతం చేయండి’ అనే పేరుతో గురువారం మార్గదర్శకాలను విడుదల చేస్తూ.. వెంటిలేషన్‌ను ‘సామాజిక రక్షణవ్యవస్థ’గా అభివర్ణించింది. ఇండ్లల్లో, కార్యాలయాల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించటానికి గాలి ధారాళంగా ప్రసరించే వెంటిలేషన్ వ్యవస్థ కచ్చితంగా ఉండాలని తెలిపింది. కిటికీలు, తలుపులు మూసి ఉన్న గదుల్లో వైరస్ అక్కడక్కడే గాలిలో తిరిగి ఎక్కువ మందికి వ్యాపిస్తుందని, వెంటిలేషన్ ఉంటే గాలి బయటకు వెళ్లి వైరస్ సోకే ముప్పు తగ్గుతుందని సూచించింది.
మార్గదర్శకాలు

- కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ 10 మీటర్ల దాకా వ్యాపిస్తుంది. కాబట్టి, జాగ్రత్తలు తీసుకోవాలి.
- లక్షణాలు కనిపించనివారి నుంచి కూడా వైరస్ వ్యాపిస్తుంది.
- వైరస్ నుంచి రక్షణకు రెండు మాస్కులను ధరించటం లేదా ఎన్95 మాస్కును ధరించటం, భౌతిక దూరం, వెంటిలేషన్ తప్పనిసరి.
- ఆఫీసుల్లో కిటిటీలు తెరిచే ఉంచాలి. గాలి బయటకు వెళ్లేలా ఫ్యాన్లు వేస్తే మంచిది.
- షాపింగ్ మాల్స్, ఆడిటోరియంలలో రూఫ్ వెంటిలేషన్ తప్పనిసరి. పెద్ద పెద్ద భవంతుల్లో గాలి బయటకు వెళ్లేలా సెంట్రల్ ఎయిర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

