కొత్తముప్పు.. వైట్ ఫంగస్
- బీహార్‌లో వెలుగుచూసిన కేసులు
- నలుగురిలో గుర్తింపు.. బాధితుల్లో ఒక వైద్యుడు కూడా..
- బ్లాక్ ఫంగస్‌తో పోలిస్తే మరింత ప్రమాదకరం
- ఊపిరితిత్తులతోపాటు ఇతర అవయవాలపైనా ఎఫెక్ట్
- మహిళలు, పిల్లలకు సోకితే మరింత ప్రమాదకరం
- ఆక్సిజన్ పరికరాలు, వెంటిలేటర్ల శానిటైజేషన్‌తో కట్టడి

పాట్నా, మే 20: ఓ పక్క కరోనా సెకండ్‌వేవ్.. మరోపక్క బ్లాక్ ఫంగస్.. వీటితోనే దేశమంతా అతలాకుతలం అవుతుంటే.. మూడోముప్పు ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే.. వైట్ ఫంగస్. బీహార్ రాజధాని పాట్నాలో ఇప్పటివరకూ నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పాట్నాకు చెందిన ప్రముఖ వైద్యుడు కూడా ఉన్నారు. ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఈ వ్యాధి.. బ్లాక్ ఫంగస్ కంటే ఎక్కువ ప్రమాదకరమైనదని వైద్యులు చెబుతున్నారు.
నవజాత శిశువులు, పిల్లలు, మహిళలు, క్యాన్సర్ రోగులకు ఈ వ్యాధి సోకితే మరింత ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కరోనా తరహా లక్షణాలు కనిపించడంతో నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించామని పాట్నా మెడికల్ కాలేజీ, దవాఖాన మైక్రోబయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ తెలిపారు. అయితే, వారిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కాలేదని, దీంతో హెచ్ఆర్సీటీ స్కాన్ నిర్వహించగా ఊపిరితిత్తుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్టు తెలిసిందన్నారు. బాధితులకు యాంటీ-ఫంగల్ ఔషధాలు ఇచ్చామని, ప్రస్తుతం వాళ్లు కోలుకున్నట్టు వివరించారు.
వైట్ ఫంగస్ ప్రాథమిక లక్షణాలేంటి?
మహిళల్లో అయితే తరుచూ జననాంగం నుంచి తెల్లని శ్లేష్మంలాంటి ద్రవం కారడం (ల్యూకోరోయా అని అంటారు), నవజాత శిశువుల్లో మర్మావయం వద్ద తెల్లని, ఎర్రని మచ్చలు ఏర్పడటం (డయపర్ క్యాండియాసిస్), పిల్లలు, పెద్దల్లో నాలుకపై, నోటిలో ఎర్రని పూతపూయడం.

ఎవరికి సోకే ప్రమాదం ఎక్కువ?
ఆక్సిజన్ సపోర్ట్‌తో కొవిడ్-19 చికిత్స తీసుకుంటున్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు, దీర్ఘకాలంగా స్టెరాయిడ్లను తీసుకుంటున్నవారు.
ఏ అవయవాలపై ప్రభావం?
ఊపిరితిత్తులతో పాటు గోర్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, నోరు, మర్మాంగాలపై వైట్ ఫంగస్ ప్రభావం చూపొచ్చు. అందుకే ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కట్టడి చేసే మార్గాలేవి?
ఆక్సిజన్ పరికరాలను, వెంటిలేటర్లను సరిగ్గా శానిటైజ్ చేస్తే వైట్ ఫంగస్ నుంచి రక్షణ పొందొచ్చు.

ఆ నీటితో వైట్ ఫంగస్?
ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానించే హ్యుమిడిఫయర్‌లో కొందరు నల్లా నీళ్లను వాడుతున్నారని డాక్టర్ ఎస్ఎన్ సింగ్ తెలిపారు. ఈ నీటిలో వైట్ ఫంగస్ ఉండే అవకాశమున్నదని, ఇది కరోనా రోగుల ఛాతిలోకి ప్రవేశించే ప్రమాదమున్నదన్నారు. సూక్ష్మజీవులు లేని శుద్ధమైన నీటినే హ్యుమిడిఫయర్‌లో వాడాలని సూచించారు.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

