స్టార్ హీరోలతోనే కాకుండా కథను బట్టి చిన్న హీరోలతోనూ సినిమా చేసేందుకు రెడీగా ఉంటాడు టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ . మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహేశ్ బాబు సినిమా తర్వాత ఈ మాటల మాంత్రికుడు చేయబోయే ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మహేశ్ మూవీ తర్వాత చిన్న సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట త్రివిక్రమ్. లాక్ డౌన్ పీరియడ్లో త్రివిక్రమ్ ఓ కథ సిద్దం చేశాడని, ప్రయోగాత్మకంగా ఈ మూవీ తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతానికి తన ఫోకస్ అంతా మహేశ్ బాబు సినిమాపై పెట్టాడు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపికలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నట్టు టాక్.
బిగ్ బాస్ విన్నర్ పిలుపుతో సాయం అందించిన అభిమానులు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ.. రిలీజ్ ఎప్పుడంటే..!
రజనీకాంత్, మోహన్ బాబు ఒకే ఫ్రేములో.. పిక్ వైరల్