ఎన్టీఆర్‌కు ఇష్టమైన నెంబర్ ఏంటో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో అన్నింటి కంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్. ఒకసారి ఏదైనా కలిసొచ్చింది అంటే దాన్ని చివరి వరకు వదిలిపెట్టరు. అలాగే కలిసి రాలేదు అంటే మాత్రం కనీసం పట్టించుకోరు. ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలు దర్శకులు నిర్మాతలు ఇదే ఫాలో అవుతున్నారు. కొందరు సినిమాల విషయంలో చూపిస్తుంటారు. మరికొందరు వ్యక్తిగతంగానూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటే.. ఈయన కార్ నెంబర్ 9999 ఉంటుంది. ఏ కొత్త కారు తీసుకున్నా కూడా దాని నెంబర్ మాత్రం ఇదే. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కు 9999 అనేది సెంటిమెంట్ అంటూ ప్రచారం జరిగింది.
దీనిపై అప్పట్లో యంగ్ టైగర్ కూడా స్పందించాడు. తనకు నెంబర్ల విషయంలో సెంటిమెంట్స్ లేవని.. అలాంటి అలవాటు కూడా లేవు అని క్లారిటీ ఇచ్చాడు. కాకపోతే తనకు 9 అనే అంకె మాత్రం ఇష్టమని చెప్పాడు తారక్. ఇక తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నెంబర్ 9999 అని.. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ట కూడా అదే వాడాడని.. అందుకే తనకు ఆ నెంబర్ అంటే ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. అందుకే తన కార్లకు 9999 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే తప్ప అది సెంటిమెంట్ కాదు.. తనకు ఇష్టమైన వాళ్లు వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నాను అంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
కారుతో పాటు ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని కనిపిస్తుంది. తాత, తండ్రి గుర్తుగా ఆ నెంబర్ కంటిన్యూ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తున్నాడు. అందులో అన్నింటికంటే ముందు రాజమౌళి ట్రిపుల్ ఆర్ ఉంది. ఆ తర్వాత లైన్ లో కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, పరశురామ్, బుచ్చిబాబు లాంటి దర్శకులు ఉన్నారు. 2024 వరకు ఈయన డైరీ ఫుల్ అయిపోయింది.
ఇవికూడా చదవండి..
కొత్తముప్పు.. వైట్ ఫంగస్
అంటువ్యాధుల జాబితాలోకి ‘బ్లాక్ ఫంగస్’
ఇంట్లోనే కొవిడ్ పరీక్షలు!
కిటికీలు తెరవండి..ఫ్యాన్లు వేసుకోండి!
జూలై చివరికి విముక్తి
పీపీఈ కిట్‌కు వెంటిలేషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- 9 number
- hari krishna
- Jr NTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

