సోమవారం 06 జూలై 2020
Agriculture - Jun 24, 2020 , 23:45:23

జింజర్‌ కింగ్‌ @ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ

జింజర్‌ కింగ్‌ @ 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ

వరి.. మక్కజొన్న అంటూ మూస ఫార్ములాతో సాగు చేస్తే ఏం లాభం.? అవే నష్టాలు.. అవే  సమస్యలు. దీన్ని 30 ఏండ్ల కిందటే గుర్తించిన రైతు.. రామచంద్రారెడ్డి. వికారాబాద్‌ జిల్లా గిరిగెట్‌ పల్లిలో అల్లం సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

అందరిలాగే.. రామచంద్రారెడ్డి కూడా వరి, మక్కజొన్న పంటలే వేసేవాడు. కూలీ కూడా గిట్టుబాటు కాకపోయేది. ఏం చేయాలి.? వచ్చే పని వ్యవసాయం ఒక్కటే. చేస్తే ఏదైనా తెలివితో సాగు చేయాలి.. లేకపోతే వ్యవసాయం నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు అతను. ఒక ప్రయత్నంగా రెండెకరాల్లో అల్లం సాగు మొదలుపెట్టాడు. ఇక్కడి భూముల్లో పండుతుందో లేదో అని పంట చేతికి వచ్చేవరకు ఆందోళనలోనే ఉన్నాడు. కానీ మంచి దిగుబడి వచ్చింది. మార్కెట్లో మంచి రేటు పలికింది. ఇక అప్పటి నుంచీ ఇప్పటి వరకు అల్లం సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. రామచంద్రారెడ్డి సక్సెస్‌ చూశాక వికారాబాద్‌లోని అత్వెల్లి.. మద్దులపల్లి రైతులు కూడా అల్లం సాగు చేయడం మొదలు పెట్టారు. కేరళ నుంచి విత్తనాలు తెచ్చి.. కోడి ఎరువు వేసి ఎకరాకు ఎంత లేదన్నా 100 క్వింటాళ్ల దిగుబడి రాబడుతున్నాడు. ఏడాదికి రెండెకరాలకు రూ.3 లక్షల పెట్టుబడి పెడుతూ.. రూ.5 లక్షల దిగుబడి సాధిస్తున్నాడు. ప్రతి రెండేండ్లకు ఒకసారి పంట మార్పిడి.. భూ మార్పిడి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉస్మాన్‌ గంజ్‌  వ్యాపారులు వచ్చి మరీ పంట కొనుగోలు చేస్తున్నారు.


logo