IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్‌తో పునరాగమనం చేసిన రిషభ్ పంత్(IPL 2024) జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. నాయకుడిగా, వికెట్‌కీపర్‌గా రాణిస్తూ.. ధనాధన్ బ్యాటింగ్‌తో ఢిల్లీ విజయాల్లో కీలకం అవుతున్నాడు. అయితే.. ప్లే ఆఫ్స్ బెర్తుపై కన్నేసిన పంత్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ కోడ్ (IPL Code Of Conduct) ఉల్లంఘించినందుకు అతడిపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. దాంతో, ప్లే ఆఫ్స్‌కు ముందు పంత్ ఒక మ్యాచ్‌కు దూరం కానున్నాడు.
అసలేం జరిగిందంటే..? రాజస్థాన్ రాయల్స్‌తో మే 7న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత సమయంలో ఓవర్లలో కోటా పూర్తి చేయలేదు. దాంతో, మ్యాచ్ రెఫరీ ఈ విషయమై పంత్‌పై ఐపీఎల్ కోడ్ కమిటీకి ఫిర్యాదు చేశాడు.ఇప్పటికే రెండు సార్లు జరిమానాతో బతికిపోయిన పంత్.. మూడోసారి అదే పొరపాటు చేశాడు. దాంతో, ఐపీఎల్ కమిటీ ఢిల్లీ సారథిపై కఠినంగా వ్యవహరిస్తూ భారీ ఫైన్‌తో పాటు ఒక్క మ్యాచ్ నిషేధం నిర్ణయం తీసుకుంది.
Rishabh Pant will be suspended for Delhi Capitals’ game against RCB after his team’s third over-rate offence of the season ❌ pic.twitter.com/nopkrIMpf1
— ESPNcricinfo (@ESPNcricinfo) May 11, 2024
ఇంతకు ముందు పంత్‌కు స్లో ఓవర్ రేటు నెపంతో రూ. 12 లక్షలు, రూ. 24 లక్షల జరిమానా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరు విజయాలతో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీకి మరో రెండు మ్యాచులు ఉన్నాయి. ఆర్సీబీ, లక్నోపై పంత్ సేన భారీ తేడాతో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే చాన్స్ ఉంది.
పదిహేడీ సీజన్లో నిషేధానికి గురైన రెండో ఆటగాడిగా పంత్ నిలిచాడు. అతడి కంటే ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రానా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన రానా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పొరెల్‌ను బౌల్డ్ చేశాక ఫ్లయింగ్ ఇవ్వబోయి.. డగౌట్‌కు దారి చూపాడు. దాంతో, వరుసగా రెండుసార్లు ఐపీఎల్ కోడ్ ఉల్లంఘించిన అతడిపై నిషేధం పడింది.

Harshit