Kylian Mbappe | ఏడేండ్ల బంధానికి గుడ్ బై.. ఫ్రాన్స్ స్టార్ అడుగులు ఎటువైపో..!
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) కీలక నిర్ణయం తీసుకున్నాడు. పారిస్ సెయింట్ జర్మనీ (Paris Saint Germany) క్లబ్‌ను వీడడంపై కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్దతకు తెరదించాడు.
Kylian Mbappe : ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపే (Kylian Mbappe) కీలక నిర్ణయం తీసుకున్నాడు. పారిస్ సెయింట్ జర్మనీ (Paris Saint Germany) క్లబ్‌ను వీడడంపై కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్దతకు తెరదించాడు. ఏడేండ్లుగా పీఎస్జీతో ఉన్న బంధానికి ముగింపు పలికాడు. అవును.. ఆ క్లబ్‌తో తెగ తెంపులు చేసుకుంటున్నట్లు ఎంబాపే వెల్లడించాడు.
శనివారం ఈ స్టార్ ఫుట్‌బాలర్ నాలుగు నిమిషాల వీడియో విడుదల చేశాడు. అందులో తాను పీఎస్జీకి గుడ్ బై చెప్తున్నాన్నని ఎంబాబే తెలిపాడు. అయితే.. తర్వాత అతడు ఏ క్లబ్లో చేరుతాడు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
MERCI. 🔴🔵 @PSG_inside pic.twitter.com/t0cL2wPpjX
— Kylian Mbappé (@KMbappe) May 10, 2024
రియల్ మాడ్రిడ్‌తో ఒప్పందం..?
పీఎస్జీని వీడిన ఎంబాపే త్వరలోనే రియల్ మాడ్రిడ్ క్లబ్(Real Madrid)తో ఒప్పందం చేసుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై ఈ యంగ్‌స్టర్ ఇంకా మౌనం దాల్చుతున్నాడు. దాంతో, అతడి నిర్ణయం కోసం అభిమానులు, ఫుట్‌బాల్ క్లబ్ యజమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Nous sommes le Paris Saint-Germain. 🔴🔵 pic.twitter.com/q9QGP2PbtO
— Kylian Mbappé (@KMbappe) April 16, 2024
306 మ్యాచుల్లో 255 గోల్స్
ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారిన ఎంబాపే 2007లో మొనాకో క్లబ్ నుంచి పీఎస్జీలో చేరాడు. అప్పటి నుంచి ఏడేండ్లు ఆ క్లబ్‌కు ఆడాడు. పీఎస్జీ తరఫున 306 మ్యాచ్‌లు ఆడిన ఎంబాపే 255 గోల్స్ కొట్టడమే కాకుండా 108 గోల్స్ చేయడంలో సహచరులకు సహాయం చేశాడు.
‘గోల్డెన్ బూట్’ అవార్డు
నిరుడు ఖతర్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో 23 ఏండ్ల ఎంబాపే అదరగొట్టాడు. అర్జెంటీనా(Arjentina)తో హోరాహోరీగా ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్(Hat-trick Goals) కొట్టి లియోనల్ మెస్సీ సేనను వణికించాడు. కానీ, అనూహ్యంగా షూటౌట్లో 2-4తో ఫ్రాన్స్ ఓటమి పాలైంది. జట్టుకు వరల్డ్ కప్ అందించలేకపోయిన ఎంబాపే.. అత్యధికంగా 8 గోల్స్ కొట్టి ‘గోల్డెన్ బూట్’ అవార్డు అందుకున్నాడు.
‘గోల్డెన్ బూట్’ అవార్డుతో ఎంబాపే

ఇవి కూడా చదవండి
- KCR | హైదరాబాద్ ప్రగతిని గమనించి ‘పవర్ ఐలాండ్’ను చేసిన : కేసీఆర్
- TS Weather | తెలంగాణలో మరో నాలుగురోజులు వర్షాలే..! ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

