Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో తన స్టార్‌డమ్‌ను మరింత పెంచుకున్న బన్నీ, ఇప్పుడు సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్న అల్లు అర్జున్, తాజాగా సినిమా ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌లో ఫార్మల్గా ప్రారంభమైంది. ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ న్యూస్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యింది. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక సౌండ్ అండ్ ప్రొజెక్షన్ సిస్టమ్స్‌తో ఈ మల్టీప్లెక్స్‌ను రూపొందించారు. ముఖ్యంగా ఈ థియేటర్లో అల్లు కుటుంబానికి సంబంధించిన ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.
అల్లు సినిమాస్‌లో తాత అల్లు రామలింగయ్య, తండ్రి అల్లు అరవింద్‌లతో పాటు మామయ్య మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను కూడా ఏర్పాటు చేసి, కుటుంబ వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు. ఈ విషయం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సినిమాలతో అల్లు సినిమాస్ లాంఛనంగా రెగ్యులర్ షోలను ప్రారంభించనుండగా, ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రమోషన్స్ విషయంలో కూడా అల్లు అర్జున్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. సాధారణంగా సెలబ్రిటీలు బ్రాండ్ ప్రమోషన్స్‌ను ఇతరుల చేత చేయిస్తే, బన్నీ మాత్రం స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. తాజాగా అల్లు సినిమాస్ కోసం యాడ్ షూట్స్ కూడా మొదలయ్యాయి. ఈ యాడ్స్‌కు ‘జెర్సీ’, ‘కింగ్డమ్’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.
సినిమాల విషయానికి వస్తే… ‘పుష్ప 2’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మేకర్స్ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పుష్ప తర్వాత బన్నీ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. భారీ విజువల్స్, అంతర్జాతీయ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.