WTC Rankings : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్‌లో సమీకరణాలు మారుతున్నాయి. స్వదేశంలో ముగిసిన యాషెస్ సిరీస్(Ashes Series)లో ఇంగ్లండ్‌ను 4-1తో చిత్తు చేసిన ఆస్ట్రేలియా (Australia) అగ్రస్థానం నిలబెట్టుకుంది. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ 87.50 విజయాల శాతంతో ఫైనల్ బెర్తుకు మరింత చేరువైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు (Team India) ఆరో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది.
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జోరుతో డబ్ల్యూటీసీలో నంబర్ 1 ర్యాంక్ కాపాడుకుంది. ఇటీవల వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్ 77.78 విజయావకాశాలతో రెండో ర్యాంక్ కైవసం చేసుకుంది. గత సీజన్ విజేత దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలవగా.. శ్రీలంక 66.67 శాతం విజయాలతో నాలుగో ర్యాంక్ సాధించింది. పాకిస్థాన్ ఐదో ర్యాంక్‌లో ఉండగా.. టీమిండియా ఆరో ర్యాంక్‌లోనే ఉండిపోయింది.
Australia strengthen their hold on top spot on the #WTC27 table 👊
Full standings 📲 https://t.co/TJt9cbipMe pic.twitter.com/JknSI8krDT
— ICC (@ICC) January 8, 2026
డబ్ల్యూటీసీలో వరుసగా రెండుసార్లు ఫైనల్ ఆడిన భారత్ హ్యాట్రిక్ ఆశలు ఆవిరవుతున్నాయి. ఈసారి ఎలాగైనా టెస్టు గదను పట్టేయాలనుకున్న టీమిండియా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్ గురవ్వడంతో మూడు నుంచి ఐదో స్థానంలో నిలిచింది. అయితే.. రెండో టెస్టులో శుక్రవారం వెస్టిండీస్‌ను 9 వికెట్లతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మూడో ర్యాంక్‌కు ఎగబాకగా.. గిల్ సేన ర్యాంకు ఆరుకు దిగజారింది. కొత్త ఏడాదిలో టీమిండయా ఐదు టెస్టులు మాత్రమే ఆడనుంది. జూన్‌లో అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు, ఆపై ఆగస్టులో శ్రీలంక పర్యటనలో రెండు, అక్టోబర్‌లో న్యూజిలాండ్ గడ్డపై రెండు మ్యాచులు ఉన్నాయంతే. ఈ ఐదు మ్యాచుల్లో గెలిచినా.. టాప్ -3లోని జట్ల ఫలితాలపై శుభ్‌మన్ గిల్ సేన ఆధారపడాల్సి ఉంటుంది.