Accident | మిర్యాలగూడ జనవరి 9: నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మిర్యాలగూడ టౌన్ లోని ఈదులగూడెం చౌరస్తా వద్ద సిమెంట్ మిక్సింగ్ ట్యాంకర్‌ను ఇటాలియన్ మార్బుల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్బుల్స్ మీద పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులు సుజిత్ కుమార్, కిషన్, సికందర్లను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరంతా బిహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. మృతులను బీరుబాయ్, సంతోశ్, సూరజ్‌గా గుర్తించారు. సిమెంట్ ట్యాంకర్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తుండగా.. డీసీఎం శంషాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.