నిర్మల్ చైన్ గేట్, జనవరి31 : దివ్యాంగుల( Disabled) ఉపాధి పునరావాస పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువు ఫిబ్రవరి 12 వరకు పొడగించినట్లు జిల్లా అదనపు కలెక్టర్, ఇంచార్జి సంక్షేమ అధికారి ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూపాయలు 50,000 సబ్సిడీతో కూడిన 21 యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఫిబ్రవరి 12 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దివ్యాంగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం రెండవ అంతస్తు కలెక్టర్ కార్యాలయం నిర్మల్లో సంప్రదించాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..