హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, బాలానగర్ ఎంటీఏఆర్ కంపెనీ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో పలువురు నాయకులు ఆ సంఘంలో చేరారు. వారికి శ్రీనివాస్‌గౌడ్ కండువా కప్పి బీఆర్టీయూలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో వీ జంగయ్య, కే శ్రీనివాసరావు, టీ తారాకృష్ణ, రంజిత్‌రెడ్డి, సురేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రటరీ ఎం రాజయ్య, ఉపాధ్యక్షుడు ఎం సమ్మయ్య, కే సత్యప్రసాద్, బీ జనార్దన్‌రెడ్డి, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు.