Naga Chaitanya – Lokesh Kanagaraj | యువ నటుడు నాగ చైతన్య తన మనసులోని మాటను బయటపెట్టాడు. తమిళ దర్శకుడు లోకేష్ దర్శకత్వంలో వచ్చిన ఎల్సీయూ ప్రాంఛైజీలో భాగం కావాలనుందని తెలిపాడు. చైతూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్. సాయి పల్లవి కథానాయికగా నటిస్తుండగా.. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్ని వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. రీసెంట్గా చెన్నైలో ఈవెంట్‌ను నిర్వహించగా.. ఈ వేడుకకు నటుడు కార్తీతో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ హాజరై సందడి చేశారు.
అయితే ఈ మూవీ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టాడు. లోకేష్ కనగరాజ్ తనకు ఇష్టమైన దర్శకుడని.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎల్సీయూ ప్రాంఛైజీ(ఖైదీ, విక్రమ్, లియో) సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. నాకు ఛాన్స్ వస్తే.. ఎల్సీయూ ఫ్యూచర్ ప్రాజెక్ట్(ఖైదీ 2, రోలెక్స్, లియో 2)లలో భాగం కావాలనుందని తెలిపారు.