హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం రోజురోజుకూ సంక్షోభంలోకి వెళ్లిపోతున్నదని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ అన్నారు. విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.
సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడు తూ.. కేంద్రం జాతీయ నూతన విద్యావిధానం-2020 తీసుకొచ్చి విద్యా వ్యవస్థను కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ చేస్తూ అత్యంత ప్రమాదంలోకి విద్యారంగాన్ని నెట్టిందని మండిపడ్డారు.