Virat Kohli : అంతర్జాతీయ క్రికెట్ సహా ఫ్రాంచైజీ క్రికెట్‌కు అజింక్యా రహానే(Ajinkya Rahane) వీడ్కోలుపై మాజీ క్రికెటర్లు వరసగా స్పందిస్తున్నారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం రహానే రిటైర్మెంట్పై రియాక్ట్ అయ్యాడు. ఒకప్పుడు రహానేతో కలిసి మైదానంలోకి దిగిన, క్రీజునంటుకున్న రోజులను గుర్తు చేస్తున్న విరాట్.. అతడిని టెస్టుల్లో తన ఫేవరెట్ భాగస్వామిగా పేర్కొన్నాడు. రహానే రిటైర్మెంట్పై సోషల్ మీడియా వేదికగా కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన అజింక్యా రహానేకు విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపాడు. సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతడి కెరీర్ గొప్పగా సాగిందని పేర్కొన్న విరాట్.. ఇకపై కూడా అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించాడు.

‘జింక్స్.. నీ క్రికెట్ కెరీర్ గొప్పగా సాగినందుకు అభినందనలు. భారత క్రికెటర్‌గా నువ్వు అద్భుతాలు చేశావు. నీ ఈ ప్రయాణాం పట్ల నువ్వు చాలా గర్వపడాలి. స్లిప్‌లో నీ చేతులు చాలా సురక్షితమైనవి. టెస్టుల్లో నాకు ఇష్టమైన భాగస్వామివి నువ్వే. నువ్వు ఎల్లప్పుడూ బాగుండాలి. దేవుడి ఆశీర్వాదం నీకు ఉంటుంది’ అని కోహ్లీ తన పోస్ట్‌లో వెల్లడించాడు. నిజానికి కోహ్లీ కెప్టెన్సీలోనే రహానే కెరీర్ గొప్పగా సాగింది. విరాట్ హయాంలోనే అతడు వైస్ కెప్టెన్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా స్థిరంగా రాణించాడు.
“My favourite Test batting partner”: 🗣️ Virat Kohli on Ajinkya Rahane ✨ pic.twitter.com/sya0INg2cZ
— Cricinfo (@cricinfo) July 30, 2026
మూడేళ్ల క్రితం వరకూ విరాట్, కోహ్లీ, రహానే.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం. ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ ముగ్గురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ధి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు చేరడంలో ఈ సీనియర్ త్రయం కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో ఈ ముగ్గురి వాటాను మరువలేం.

ఫస్ట్ క్లాస్‌లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు రహానే. పుజారా(3వ స్థానం), కోహ్లీ(4వ స్థానం)తో కలిసి మిడిలార్డర్లో భారత టెస్టు జట్టుకు మూల స్తంభంగా మారాడు. 2016లో న్యూజిలాండ్‌పై కోహ్లీ, రహానేలు.. నాలుగో వికెట్‌కు 365 రన్స్ చేయడం ఓ రికార్డు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో పుజరాతో కలిసి రహానే విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.