Air India | సిటీ బ్యూరో : హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నగరానికి కొత్తగా విమాన సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయ్యిందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సర్వీస్ ద్వారా ఫుకెట్-హైదరాబాద్ మధ్య కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. ఈ విమానం 3.45 గంటల్లో గమ్యానికి చేరకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో మూడు సర్వీసులను నడుపుతుందని ఆయన తెలిపారు. 15వ తేదీ నుంచి ఫ్రీక్వెన్సీ వారానికి ఆరు విమానాలకు పెరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్-ఫుకెట్ మధ్య నేరుగా సర్వీసులు ప్రారంభించిన తొలి ఎయిర్‌లైన్‌గా నిలవడం ఆనందంగా ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ తెలిపారు.