– బీఆర్ఎస్ నాయకుల అర్ధనగ్న ప్రదర్శన
తుంగతుర్తి, మార్చి 06 : తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం-గోరెంట్ల రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం కొత్తగూడెంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ కొత్తగూడెం- గోరంట్ల రోడ్డు మంజూరు చేయించినా, ప్రస్తుత ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇప్పటికీ పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో అసంపూర్తిగా ఉన్న ఇతర రహదారులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం, సర్పంచ్ మేడదుల రమేశ్, ఉప సర్పంచ్ మహేశ్, నాయకులు సింహాద్రి, కరుణాకర్, కేశవరెడ్డి, సత్యనారాయణ, పాపులు, సందీప్, ప్రవీణ్, సుధాకర్ పాల్గొన్నారు.