మత్స్యకారుల సంప్రదాయ పడవ పోటీల నేపథ్యంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వందకోట్ల వసూళ్లను రాబట్టింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తెలుగులో విడుదలైంది.
తాజాగా ఈ చిత్రబృందాన్ని అగ్ర నటుడు కమల్‌హాసన్ అభినందించారు. మంచి కాన్సెస్ట్‌తో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. ‘జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. మా చిత్రబృందానికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, చెప్పిన మాటలు ఎంతో ప్రత్యేకం’ అని హీరో సూరి సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.