కోల్‌కతా: తన తండ్రితో ఒక మహిళకు వివాహేతర సంబంధం ఉందని ఒక బాలుడు అనుమానించాడు. తల్లి, మరో వ్యక్తితో కలిసి టీ స్టాల్ వద్దకు వచ్చాడు. తండ్రితో కలిసి టీ తాగుతున్న ఆ మహిళను కత్తితో పొడిచి చంపాడు. (Boy Stabs Woman) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 30న రాత్రి 8 గంటల సమయంలో ఈఎం బైపాస్‌లోని ప్రముఖ టీ షాప్ వద్ద ఒక వ్యక్తి, 24 ఏళ్ల మహిళ కలిసి టీ తాగుతున్నారు.
కాగా, ఆ వ్యక్తి కుమారుడైన 16 ఏళ్ల బాలుడు తన తల్లి, మరొకరితో కలిసి అక్కడకు వచ్చాడు. తన తండ్రి, కలిసి టీ తాగుతున్న మహిళ మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. కత్తితో ఆమెపై దాడి చేశాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ మహిళను వెంబడించి పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళను కత్తితో పొడిచిన మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి తల్లితోపాటు వెంట వచ్చిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.