హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్‌పై సీపీఐ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ మిత్రదర్మం పాటించలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పేదలకు ఇండ్ల స్థలాల పై ఈ నెల 20వ తేదీన చలో అసెంబ్లీ కి పిలుపునిచ్చామని తెలిపారు. సింగరేణిని కాపాడెందుకు వారం రోజుల పాటు నిరసనలు చేపడుతామని, అమెరికా చర్యల పై మోదీ మౌనం విడాలన్నారు.
మోదీ పాలనలో ఇండియా చుట్టూ ఉన్న దేశాలతో పంచాయితీ ఏర్పడింది. ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపేలా మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీన కేంద్రం వైఖరి పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదు. రైతుబందు వేస్తారో లేరో చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తుతో ఉన్నాం కాబట్టే వంద పంచాయతీలు గెలిచాం.. లేదంటే మరో 60 గెలిచేవాళ్లమన్నారు. మమ్ములను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ పద్ధతి మారకపోతే – పొత్తుకు దూర అవ్వడానికి సిద్ధంగా ఉన్నమని స్పష్టం చేశారు. ఒకటి రెండు జిల్లాలో మినహా సీపీఐకి కాంగ్రెస్ సహకరించడం లేదు. కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఉండాలా కొనసాగాలా అనే నిర్ణయం వాళ్లకే వదిలేస్తున్నాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఒంటరిగా పోటీకి సిద్ధం అవుతున్నామని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు సీపీఐ వ్యతిరేకమన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని మేము ప్రశ్నించలేం. మ్మెల్యే ఫిరాయింపుల చట్టాలని డిమాండ్ చేశారు.