మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని సాయికుంట కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కత్తితో పొడిచి చంపింది. కొప్పుల నాగరాజు (49) తన కుటుంబంతో కలిసి సాయికుంట కాలనీలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నాగరాజు భార్య.. అతడిని కత్తితో పొడిచి చంపింది. అనంతరం ఆమె మంచిర్యాల పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.