Ustaad Bhagat Singh | హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్దగా హడావిడి లేకుండా సింపుల్‌గా నిర్వహించిన ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చాలా కూల్‌గా కనిపించారు. తన ప్రసంగంలో సినిమా, టికెట్ రేట్లు, ఫ్యాన్ వార్స్ వంటి అనేక అంశాలపై మాట్లాడిన ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.అయితే ఈ ఈవెంట్లో మరో అంశం కూడా నెట్టింట వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా ఆయన పక్కనే హీరోయిన్ శ్రీలీల నిలబడి ఉండగా, వెనుక వైపున నిలబడ్డ జబర్దస్త్ ఫేమ్ మహేష్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో శ్రీలీల ఒక్కసారిగా వెనక్కి తిరిగి మహేష్ వైపు చూసినట్లు కనిపించింది. మహేష్ మాత్రం నవ్వుతూ కనిపించాడు.
ఇది చూసిన కొందరు నెటిజన్లు మహేష్ ఏదో చేశాడని ఊహిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టారు. శ్రీలీల సీరియస్ లుక్ ఇచ్చిందని, అందుకే ఏదో జరిగి ఉండొచ్చని కామెంట్లు పెట్టారు. మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా మహేష్ ఫోన్ చూస్తున్నాడని, అందుకే శ్రీలీల అసహనం వ్యక్తం చేసిందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోతో అనేక రకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో విస్తరించాయి. ఈ వివాదం మరింత పెరగకముందే మహేష్ సోషల్ మీడియా ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడుతూ… “ఈవెంట్‌కు ముందు శ్రీలీల గారు తన ఫోన్ నన్ను పట్టుకోమని ఇచ్చారు. తర్వాత ఆమె వెనక్కి తిరిగి నా వైపు చూసినప్పుడు ఫోన్ కోసం చూస్తున్నారని అనుకున్నాను. అదే సమయంలో ఆమె స్టేజ్ స్క్రీన్ వైపు పైకి చూసారు. జరిగినది అంతే. ఇందులో ఎవరినీ తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరినీ అగౌరవ పరచవద్దు” అని తన పోస్టులో పేర్కొన్నారు.
మహేష్ ఇచ్చిన ఈ వివరణతో ఈ వివాదం కొంతమేరకు సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై శ్రీలీల స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. అభిమానులు కూడా సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.