ఉద్యోగం మారితే .. పీఎఫ్ ఖాతా పరిస్థితి ఏంటి..?

ఢిల్లీ,జులై 2:ఉద్యోగులు మరో సంస్థలో చేరిన సమయంలో రెండు యూనివర్సల్ అకౌంట్ నంబర్స్(యుఏఎన్) ఉంటాయి. ఇంతకుముందు చేసిన ఉద్యోగంలో ఒక యుఏఎన్ తో పాటు, మరో కంపెనీలో చేరినప్పుడు కొత్తగా యుఏఎన్ ఉంటుంది. అయితే అలా కాకుండా ముందు ఉన్న యుఏఎన్ కొత్త కంపెనీకి ఇస్తే అదే ఈపీఎఫ్ ఖాతాలో ప్రతి నెల పిఎఫ్ డిపాజిట్ అవుతుంది. ఒక ఉద్యోగి ఎన్ని సంస్థలు మారినా ఒకే యుఏఎన్ తో అనుసంధానించిన పిఎఫ్ ఖాతాను నిర్వహించుకునే సదుపాయం ఉంది. ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌కు వెళ్లి రెండు యూఏఎన్ నెంబర్లను మెర్జ్ చేయవచ్చు.
ప్రస్తుత యుఏఎన్ ను కొత్త యజమానికి వెల్లడించకపోయిన పక్షంలో, అక్కడ కొత్త యుఏఎన్ జారీ అవుతుంది. గత యజమాని సకాలంలో సమ్మతించకపోతే రెండు యుఏఎన్లు జారీ అయ్యే అవకాశముంది. ఉద్యోగం మారినప్పుడు కంపెనీ యజమానులు వారి చివరి తేదీని ఈపీఎఫ్ ఓకు తెలియజేయాలి. వారు దానిని నెలవారీ దాఖలు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ చలాన్ అండ్ రిటర్న్(ఈసీఆర్)లో పేర్కొంటారు. ఈ విధానం సకాలంలో చేయకపోతే కొత్త యజమాన్యం ఉద్యోగికి తాజా యుఏఎన్ కేటాయిస్తుంది.
రెండు విధాలుగా యుఏఎన్లను విలీనం చేయవచ్చు. ఒకటి సభ్యుడు ఈపీఎఫ్ ఓయుఏఎన్ పోర్టల్‌కు లాగిన్ కావాలి. అప్పుడే యుఏఎన్ తో అనుసంధానం చేసిన పాత ఈపీఎఫ్ ఖాతాను కొత్తదానికి బదిలీ చేసుకోవచ్చు లేదా మెర్జ్ చేయవచ్చు. ఇదివరకటి ఖాతాలు బదిలీ అయిన తర్వాత పాత యుఏఎన్ డీయాక్టివేట్ అవుతుంది. ఈపీఎఫ్ ఓ దీనిని ఎస్సెమ్మెస్ ద్వారా ఇది వెల్లడిస్తుంది.
ఖాతాను ఇలా మెర్జ్ చేసుకోవచ్చు…
unifiedportal-mem.epfindia.gov.in పోర్టల్‌లోకి వెళ్లాలి. ఈ పోర్టల్‌లోకి లాగ్-ఇన్ అయి ఇండివిడ్యువల్స్ ఈపీఎఫ్ అకౌంట్ యుఏఎన్ నెంబర్‌ను కొత్త నెంబర్‌కు లింక్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఒకసారి ఇంతకుముందు అన్నీ అకౌంట్స్ ట్రాన్సుఫర్ అయ్యాక ఆ యూఏఎన్ డిజబుల్ అవుతుంది. ఇది ఎస్సెమ్మెస్ ద్వారా తెలుస్తుంది. కొన్నిసార్లు ఇంతకుముందు యజమాని గతంలోని పీఎఫ్ బకాయిలను జమ చేయవచ్చు. ఇవి కూడా కొత్త యుఏఎన్ లో కనిపించవచ్చు. అయితే దీనికి సమయం తీసుకుంటుంది. అయితే ఉద్యోగి వెబ్ పోర్టల్‌కు వెళ్లి ఈ-మెయిల్ పంపించడం ద్వారా ప్రస్తుత యజమానికి లేదా ఈపీఎఫ్ఓకి నివేదించవచ్చు. ఈపీఎఫ్ఓ దీనిని దృవీకరించి పాత యూఏఎన్ బ్లాక్ చేస్తుంది. అయితే ఉద్యోగి పాత ఖాతాను కొత్త క్రియాశీల యుఏఎన్ కి బదలీ చేసేందుకు రిక్వెస్ట్ పెట్టాలి. ఇలా చేయడానికి మీ కేవైసీ పూర్తి అప్ డేట్ చేసి ఉండాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EPFO
- job
- merger
- National news
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

