‘కొవాగ్జిన్’ సామర్థ్యం 77.8%.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. | కొవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను భారత్ బయోటెక్ శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్ : కొవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను భారత్ బయోటెక్ శనివారం ప్రకటించింది. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8శాతం సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 93.4శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. భారత్ బయోటెక్ మూడో దశ ట్రయల్స్‌లో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న B.1.617.2 (డెల్టా), B.1.351 (బీటా) వేరియంట్లకు వ్యతిరేకంగా 65.2 శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ ప్రకటించింది.
కొవాగ్జిన్ తీవ్ర లక్షణాలు నిలువరించి హాస్పిటలైజేషన్ తగ్గిస్తోందని పేర్కొంది. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ మెడ్జివ్ (medRxiv)లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ట్రయల్‌లో కొవాగ్జిన్ టీకా సురక్షితమైందని రుజువైందని కంపెనీ పేర్కొంది. నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే.. జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. ట్రయల్స్‌లో 146 రోజుల పాటు.. వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు.
ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా.. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లయిందని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారత్ బయోటెక్ కంపెనీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం టీకా డ్రైవ్‌లో భాగంగా అత్యవసర వినియోగం కింద టీకాను వినియోగిస్తున్నారు.
COVAXIN® Proven SAFE in India's Largest Efficacy Trial. Final Phase-3 Pre-Print Data Published on https://t.co/JJh9n3aB6V pic.twitter.com/AhnEg56vFN
— Bharat Biotech (@BharatBiotech) July 2, 2021
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

