వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి దీనికి ఉందట. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సహాయపడుతుందట

ప్రస్తుతం చాలా జంటలు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నాయి. దీంతోపాటు శృంగార జీవితం ఎక్కువ సేపు గడపలేక, భాగస్వామిని సంతృప్తి పరచలేక సమస్యలను ఎదుర్కుంటున్నాయి. ఇందుకు కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి ఏదైనా కావచ్చు. కారణాలేవైనా.. వీటిన్నింటికీ వంటింట్లో లభించే వెల్లుల్లితో చెక్‌పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇక వెల్లుల్లితో లాభాలేంటో చూద్దాం..
1. రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బరు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
2. రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అంతేకాదు, గర్భం ధరించేందుకు ప్రయత్నించినప్పుడు మహిళలకు అవసరమైన శక్తిని వెల్లుల్లి ఇస్తుంది.
3. వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి.
4. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.
5. స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారుచేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
6. చాలామంది పురుషులలో, రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) ఉత్పత్తి పెరగడం సంతానలేమికి ప్రధాన కారణం. శరీరం సహజ యాంటీఆక్సిడెంట్లు లేనప్పుడు ఆక్సీకరణస్థాయి పెరిగి ఒత్తిడిని సృష్టిస్తుంది. వెల్లుల్లి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే సెల్యులార్ నష్టాన్ని తగ్గించి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.
వెల్లుల్లితో పురుషులకు లాభాలు
1. వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. అంతేకాక.. హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలను అందిస్తుంది.
2. వెల్లుల్లిలోని అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది. వెల్లుల్లిలోని సెలీనియం సహజ యాంటీఆక్సిడెంట్ లా పనిచేసి శుక్రకణాల చలనశీలతను పెంచుతుంది. సీ, బీ-6 – ఈ విటమిన్లు వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
3. పురుషులు రెగ్యులర్‌గా వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధికావడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది.
4. రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.
స్త్రీలకు లాభాలు ఇవే..
1. వెల్లుల్లి అండోత్సర్గమును ఉత్తేజపరచడమేకాక క్రోమోజోమ్ లోపాలను నివారిస్తుంది. కాబట్టి ఆడవారిలో సంతానోత్పత్తికి బాగా సాయపడుతుంది.
2. క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకునే స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.
3. వెల్లుల్లిలోని విటమిన్ బీ- 6 పుష్కలంగా ఉంటుంది, ఇది అండోత్సర్గములో సహాయపడుతుంది.
4. వెల్లుల్లి వాసన కొందరికి నచ్చకపోవచ్చు. కానీ.. ఇది ఆహారంలో చేర్చుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తుంది. అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి బాగా సహాయ పడుతుంది.
5. ఇది చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Monsoon Diet : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి
ఈ ఐదింటిని డైట్లో చేర్చుకుంటే రక్తహీనత మాయం..!
మధుమేహులకు శుభవార్త : పాక్‌లో చక్కెర లేని మామిడి పండ్లు
షుగర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

