e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌ర్నీ భ‌య‌పెడుతోంది. కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంత‌రం చెందుతూ వైద్య‌రంగానికే స‌వాలు విసురుతోంది. ఇప్పుడంటే సాంకేతిక‌త అభివృద్ధి చెందింది కాబ‌ట్టి త్వ‌ర‌గానే వ్యాక్సిన్‌ను క‌నుగొన్నారు. అధునాత‌న వైద్య ప‌ద్ధ‌తుల‌ను వాడుతుండ‌టంతో క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. కానీ గ‌తంలోనూ ఇలాంటి మ‌హ‌మ్మారులు మాన‌వాళిని వ‌ణికించాయి. ల‌క్ష‌లాది మందిని బ‌లిగొన్న ఆ అంటువ్యాధులు కాల‌క్ర‌మేణా అంత‌రించిపోయాయి. నిజానికి వైద్యులు, ప‌రిశోధ‌న‌లు స‌రిగ్గా లేని స‌మ‌యంలో విజృంభించిన ఆ అంటువ్యాధులు ఎలా త‌గ్గిపోయాయి? అప్ప‌టి ప్ర‌జ‌లు వాటిని ఎలా ఎదుర్కొన్నారు? వంటి విష‌యాలు ఇప్పుడు చూద్దాం..

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

పురాతన జ‌స్టీనియ‌న్ ప్లేగు

చ‌రిత్ర‌లోనే అతి భ‌యంక‌ర‌మైన వ్యాధుల్లో ప్లేగు వ్యాధి ఒక‌టి. చిత్ర‌లో మూడుసార్లు ఈ వ్యాధి వినాశ‌నం సృష్టించింది. ఇది వైర‌స్‌తో వ్యాపించే వ్యాధి కాదు.. బ్యాక్టీరియాతో వ్యాపిస్తుంది. ఎలుక‌ల మీద ఉండే చిన్న చిన్న పురుగులు, ఈగ‌ల ద్వారా ఇది మ‌నుషుల్లోకి వ్యాపించింది. మ‌నుషుల్లో తుమ్ము, ద‌గ్గు తుంప‌ర్ల ద్వారా ఒక‌రి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. మొట్ట‌మొద‌టిసారిగా చీక‌టి యుగంలో క్రీస్తు శ‌కం 541లో వ్యాపించింది. ఈశాన్య యూర‌ప్ రాజ్య‌మైన బిజంటైన్ రాజ‌ధాని కాన్‌స్టాంటినోపిల్‌లో మొద‌టిసారి ప్లేగు వ్యాధి వ‌చ్చింది. ఈజిప్టు నుంచి మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రం మీదుగా ఈ వ్యాధి పాకింద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత ఈ ప్లేగు యూర‌ప్‌తో పాటు ఆసియా, నార్త్ అమెరికా, అరేబియా దేశాల‌కు వ్యాపించింది. అప్ప‌ట్లో వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి చెంద‌క‌పోవ‌డంతో స‌రైన మందులు లేక కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. క్రీస్తు శ‌కం 750 వ‌ర‌కు ఈ ప్లేగు వ్యాధి విల‌య‌తాండ‌వం చేసింది. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా వ్యాధి ప్ర‌బ‌లడం త‌గ్గింది. కేవ‌లం వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉన్న వారు మాత్ర‌మే దీని నుంచి బ‌తికి బ‌య‌ట‌ప‌డి ఉండొచ్చ‌ని చ‌రిత్ర‌కారులు భావిస్తున్నారు.

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

బ్లాక్ డెత్ ( బ్యుబోనిక్ ప్లేగు )

- Advertisement -

జ‌స్టీనియ‌న్ ప్లేగుకు కార‌ణ‌మైన యెర్సీనియా పెస్టిస్ బ్యాక్టీరియా దాదాపు 800 సంవ‌త్స‌రాల త‌ర్వాత బ్యుబోనిక్ ప్లేగుగా రూపాంత‌రం చెందింది. ఈ అంటువ్యాధి సోకితే శ‌రీరంపై బ్యూబోస్ అని పిలిచే బొబ్బ‌లు వ‌స్తాయి. బ్లాక్ డెత్‌గా వ్య‌వ‌హ‌రించే ఈ వ్యాధి 1346-1353 మధ్య కాలంలో యూర‌ప్ మొత్తాన్ని వ‌ణికించింది. ఈ వ్యాధి కార‌ణంగా నాలుగేళ్ల‌లో దాదాపు 20 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. చరిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ప్రాణాంత‌క‌మైన మ‌హ‌మ్మారి ఇదే. ఈ వ్యాధిని ఎలా నివారించాలో తెలియ‌క‌పోయినా క‌ఠిన‌మైన క్వారంటైన్ పాటిస్తూ.. ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుంటూ ఈ అంటువ్యాధిని నివారించ‌గ‌లిగారు. వ్యాధి నిర్ధార‌ణ అయిన వ్య‌క్తులు ఇత‌రుల‌తో క‌ల‌వ‌కుండా ప్ర‌త్యేక ప్రాంతాల‌కు కూడా త‌ర‌లించారు. రోమ‌న్ ఆధీనంలో ఉన్న ఓడ‌రేవుల్లో క‌ఠిన‌మైన ఐసోలేష‌న్ కూడా మొద‌లుపెట్టారు. ఓడ‌ల్లో ప్ర‌యాణించి వచ్చిన వారిని దాదాపు 40 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచేవారు. అప్ప‌టికీ వారిలో ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోతే.. అప్పుడు వారిని ప‌ట్ట‌ణాల్లోకి అనుమ‌తించేవారు.

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

మూడోసారి మ‌ళ్లీ…

యూర‌ప్‌లో ప్ర‌తి 20 ఏండ్ల‌కు ఒక‌సారి ప్లేగు వ్యాధి విజృంభిస్తూనే ఉంది. 1347 నుంచి 1666 మ‌ధ్య కాలంలో ప్ర‌తి 20 ఏండ్ల‌కు ఒక‌సారిగా దాదాపు 40సార్లు ఈ వ్యాధి త‌న ప్ర‌తాపం చూపించింది. ప్లేగు వ‌చ్చిన ప్ర‌తిసారి ల‌క్ష‌లాది మంది చ‌నిపోయేవారు. 1665లో ఇంగ్లాండ్‌లో ప్లేగు వ్యాధి విజృంభించింది. దాదాపు 7 నెల‌లో ల‌క్షలాది మంది మ‌ర‌ణించారు. దీంతో ఇంగ్లాండ్‌లో క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు. అప్ప‌ట్లో ప్లేగు వ్యాధికి పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు కార‌ణ‌మ‌ని వారు భావించారు. దీంతో పెద్ద ఎత్తున వాటిని చంపేశారు. ప్లేగు ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారిని ప్ర‌త్యేకంగా ఐసోలేష‌న్‌లో పెట్టేవారు. ప్ర‌జ‌లు ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. ఎవ‌రైనా ప్లేగుతో మ‌ర‌ణిస్తే భ‌యంతో వారిని ఇంట్లోనే పూడ్చి పెట్టారు. అలా హోం క్వారంటైన్ త‌ర‌హా క‌ఠిన నిబంధ‌న‌లు పాటించారు.

ఇన్నేళ్లు గ‌డిచినా స‌రే ఇప్ప‌టికీ బ్యుబోనిక్ ప్లేగు కేసులు అప్ప‌డ‌ప్పుడూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. గ‌త ఏడాది జూలైలో మంగోలియాలో ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే ఈ వ్యాధి గ‌తంలో అంత ప్ర‌మాద‌క‌ర‌మేమీ కాద‌నే చెప్పొచ్చు.. యాంటీబ‌యాటిక్స్ చికిత్స ద్వారా దీన్ని న‌యం చేయ‌వ‌చ్చు.

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

మ‌శూచి

స్మాల్ పాక్స్ అని పిలిచే మ‌శూచిని మొట్ట‌మొద‌టిసారిగా 1520లో గుర్తించారు. యూర‌ప్‌, ఆసియా, అరేబియా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువ‌గా సోకింది. వ‌రియోలా మైన‌ర్ అనే వైర‌స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. మశూచి సోకితే శ‌రీరంపై నీటితో నిండిన పొక్కులు ఏర్ప‌డ‌తాయి. మ‌శూచి సోకిన ప్ర‌తి ప‌ది మందిలో ముగ్గురు మ‌ర‌ణించేవారు. ఈ వ్యాధి తుమ్ము, ద‌గ్గు తుంప‌ర్ల ద్వారా లేదా శ‌రీరంపై ఏర్ప‌డే పుండ్ల ద్వారా ఒక‌రి నుంచి మరొక‌రికి సోకుతుంది. ప్లేగు వ్యాధిలాగే మ‌శూచి కూడా కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంది. ఒక్క 20వ శ‌తాబ్దంలోనే మ‌శూచితో 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. 1796లో బ్రిటిష్ డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నెర్ క‌నుగొన్న వ్యాక్సిన్‌తో మ‌శూచి పూర్తిగా పోయింది. అయితే ఈ అంటువ్యాధిని నిర్మూలించేందుకు దాదాపు రెండు శ‌తాబ్దాలు ప‌ట్టింది. మశూచిని పూర్తిగా నిర్మూలించామ‌ని 1980లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( డ‌బ్ల్యూహెచ్‌వో ) ప్ర‌క‌టించింది. ఇలా వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నిర్మూలించ‌బ‌డిన ఏకైక మాన‌వ సంక్ర‌మిత వ్యాధి ఇదే.

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

క‌ల‌రా

19వ శ‌తాబ్దంలో క‌లరా వ్యాధి ప్ర‌పంచం మొత్తాన్ని భ‌య‌పెట్టించింది. డ‌బ్ల్యూహెచ్‌వో లెక్క‌ల ప్ర‌కారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ క‌ల‌రా ఏడుసార్లు వ్యాపించింది. దీంతో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. మొద‌ట్లో ఇది చెడు గాలుల ద్వారా వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ క‌లుషిత‌మైన తాగు నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి సంక్ర‌మిస్తుంద‌ని జాన్ స్నో అనే డాక్ట‌ర్ గుర్తించారు. లండ‌న్‌లోని ఓ వీధి కుళాయిల చుట్టుప‌క్క‌న నివసిస్తున్న 500 మందికి క‌ల‌రా సోక‌డాన్ని స్నో గ‌మ‌నించారు. దీంతో అక్క‌డి వీధి కుళాయిని ప‌రిశీలించిన ఆయ‌న‌.. కలుషిత నీరు తాగడం వ‌ల్లే వారికి క‌లరా వ‌చ్చింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చాడు. దీంతో అధికారుల‌కు చెప్పి కుళాయిని తొల‌గించాడు. దీంతో ఆ ప్రాంతంలో క‌ల‌రా వ్యాప్తి ఆగిపోయింది. అప్ప‌ట్నుంచి ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధ్యానం ఇచ్చారు. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త వ‌ల్ల పాశ్చాత్య దేశాల్లో క‌లా అంత‌రించిపోయింది కానీ దిగువ ఆదాయ దేశాల్లో ఇంకా వ్యాపిస్తూనే ఉంది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం కలరా వలన దిగువ ఆదాయ దేశాల్లో ఏడాదికి 1,00,000 – 1,40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కలారాకు వ్యాక్సిన్, చికిత్స కూడా ఉన్నప్పటికీ నీటి కాలుష్యంతో ఈ వ్యాధి సులువుగా వ్యాపిస్తుంది.

క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

ఇన్‌ఫ్లుయెంజా

వాతావ‌ర‌ణం మారిన‌ప్పుడ‌ల్లా ఈ ఫ్లూ వ‌స్తూ ఉంటుంది. 19 శ‌తాబ్దం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అనేక‌సార్లు ఇది వ్యాపించింది. ఇది హెచ్‌1ఎన్‌1 వైర‌స్ ద్వారా వ్యాపిస్తుంది. 1918లో స్పెయిన్‌లో మొద‌లైన ఈ ఫ్లూ.. రెండేళ్ల‌లో ప్ర‌పంచ‌మంతా సోకింది. దీంతో 5 నుంచి 10 కోట్ల మంది మ‌ర‌ణించారు. ఇటీవ‌ల చ‌రిత్ర‌లో అత్యంత తీవ్ర‌మైన మ‌హ‌మ్మారి ఇదే. దీన్నే స్పానిష్ ఫ్లూ అని కూడా అంటారు. క‌రోనా స‌మ‌యంలో మాదిరి క్వారంటైన్ ఉండ‌టం, దూరం దూరం ఉండ‌టం వ‌ల్ల ఈ అంటువ్యాధి వ్యాప్తిని నిర్మూలించ‌గ‌లిగారు. కాలక్ర‌మేణా హెచ్‌1ఎన్‌1 వైర‌స్ క్షీణించి.. ఇప్పుడు అపాయం లేనిదిగా మారింది. కానీ ఇప్ప‌టికీ ఈ ఫ్లూ చాలా దేశాల్లో వ‌స్తూనే ఉంది.

హాంకాంగ్ ఫ్లూ 1968లో వ‌చ్చిన ఈ ఫ్లూతో 10 ల‌క్ష‌ల‌మంది చ‌నిపోయారు.

స్వైన్ ఫ్లూ – ఇది హెచ్‌1ఎన్‌1లో ర‌క‌మే. 2009లో ప్ర‌పంచ జ‌నాభాలో 21 శాతం మంది ఈ ఫ్లూ బారిన ప‌డ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Monsoon Diet : వ‌ర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Post Corona symptoms : క‌రోనా త‌గ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
క‌రోనాలా భ‌య‌పెట్టిన‌ అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?

ట్రెండింగ్‌

Advertisement