KTR | దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ దరిద్రాన్ని నెత్తిపై రుద్దుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని అన్నారు. రెండున్నరేళ్లలో నోటిఫికేషన్లు లేవని తెలిపారు.
మేమేం తప్పు చేశామని అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌కు కంటిలో నలుసులా తయారయ్యామని అరెస్టు చేస్తారా అని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలేవి? రైతు డిక్లరేషన్ సంగతి ఏమైందని నిలదీశారు. బీఆర్ఎస్ ఆందోళనతో కాంగ్రెస్ ఆగమైతుందని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బావుసింగ్ భూక్య తండాలో శుక్రవారం జరిగిన జగదాంబ మాత సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ట వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా వీర్నపల్లిలో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. మన ప్రభుత్వం లేకున్నా గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మనకు మళ్లీ మంచిరోజులు తిరిగి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.. రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.

Ktr 1
కాంగ్రెస్‌ది దండుపాళ్యం ముఠా అని విమర్శించారు. మేడారం అభివృద్ధి పనుల్లో వాటాల కోసం మంత్రులు కొట్లాడుకున్నారని గుర్తుచేశారు. ఏ ఊరికి వెళ్లినా మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒక్క ఓటు తప్పునకు ఐదేళ్ల శిక్ష తప్పదని.. ఓపిక పట్టాలని సూచించారు.
ఇవాళ ఏవారం.. రేపు ఏవారం తప్ప బీజేపీ వాళ్లకు ఏమీ తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్ అని విమర్శించారు. బండి సంజయ్ ఎక్కడైనా ఒక బడి, ఒక గుడి కట్టించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో యాదాద్రిని అద్భుతంగా నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో భూముల విలువ పడిపోయిందని అన్నారు.