రుద్రంపూర్, మే 08 : కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి నూతనంగా బాధ్యతలను చేపట్టిన పర్సనల్ ఆఫీసర్ తిరుపతిని శుక్రవారం శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పర్సనల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని, సమస్యల పరిష్కారానికి తప్పక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ మేడిపల్లి కరుణాకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్, తోకల రామచందర్ పాల్గొన్నారు.