సిద్దిపేట, ఆగస్టు 13 : సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో మోడల్‌గా తీర్చిదిద్దిన శ్రీరామకుంట వైకుంఠధామాన్ని మరింతగా సుందరీకరణ చేపడుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం పరిశీలించారు. జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పెండింగ్ పనులపై పలు సూచనలు చేశారు. వైకుంఠధామం అంటే ఒక పారు మాదిరిగా చేసుకున్నామని, మరింత సుందరీకరణగా తీర్చిదిద్దేందుకు పనులు చేపడుతున్నట్లు చెప్పారు.
మరికొన్ని మొకలు నాటాలని, సీసీ రోడ్డు వేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాల్లో లైటింగ్ లేక దహన సంసారాలకు ఇబ్బంది అవుతుందని, వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్స్ మరమ్మతులు చేపట్టాలన్నారు. బయోగ్యాస్ ద్వారా దహన సంసారాలు జరిగే విధంగా పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.