Jobs | ఉద్యోగాలెందుకు..? రిక్షాలు నడుపుకోండి.. నిరుద్యోగులకు యూపీ డిప్యూటీ సీఎం సలహా!
Jobs | బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ నిరుద్యోగులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే బదులు ఈ-రిక్షాలను నడుపుకుంటే మంచిదని సలహా ఇస్తున్న వీడియో ఒకటి వెలుగు చూసింది.
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ నిరుద్యోగులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల 3,000 మందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేసిన కొన్ని రోజులకే ఉద్యోగాల కోసం పరుగులు తీసే యువతను ఉద్దేశించి పాఠక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఒక సభను ఉద్దేశించి పాఠక్ ప్రసంగిస్తూ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నించే బదులు ఈ-రిక్షాలను నడుపుకుంటే మంచిదని సలహా ఇస్తున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. కేవలం ఉద్యోగం కోసం వెంపర్లాడకండి. నాలుగు గంటల పాటు రిక్షా నడపండి. మధ్యాహ్న సమయాన్ని మీ పిల్లలతో గడపండి అంటూ ఆయన నిరుద్యోగులకు హితవు చెప్పారు. ఈనెల 23న లక్నోలో భారత్ ట్యాక్సీ సేవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. యువతకు స్వయం ఉపాధి ఒక ప్రత్యామ్నాయమని పాఠక్ సూచించినట్టు సమాచారం.
నెటిజన్ల ఆగ్రహం
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. యువతకు మీరిచ్చే నిర్మాణాత్మక సలహా ఇదేనా అంటూ వారు ఆయనపై విమర్శలు గుప్పించారు. దేశంలోని యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు దూరంగా చాలా మంది నాయకులు తమ పిల్లలను విదేశాల్లో చదువుకోవడానికి పంపారని నెటిజన్లు విమర్శించారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ నేత పుష్పేంద్ర సరోజ్ ఎక్స్ వేదికగా పాఠక్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ సొంతింటి పేరు ఏంటో తెలుసా..తన జీవితాన్ని మార్చిన సినిమా పేరే పెట్టుకుంది!
Love Makthal’ | ‘లవ్ మక్తల్’ బోర్డును శుభ్రం చేసిన బీఆర్ఎస్ నాయకులు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

