భువనగిరి అర్బన్ ఆగస్టు 13. భువనగిరిలోని భగాయత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో వేపచెట్టు కొమ్మ విరిగిపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
వారిని జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. భువనగిరి హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన దావుద్ అలీ-అమీనా కూతురు అలీమా(8) మృతి చెందగా.. హర్షిత్, మరో విద్యార్థి కాళ్లు విరిగాయి.