ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం భేటీ
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శనివారం బీజేపీ

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో శనివారం బీజేపీ శాసనసభా పక్షం సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగనుంది. ఈ సందర్భంగా కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరుకానున్నారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా ఆయనను బీజేపీ అధిష్ఠానం నియమించింది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్ కౌశిక్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
ఇందులో తమ తదుపరి శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. అయితే, సత్పాల్ రావత్, ధన్సింగ్ రావత్‌లో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్సింగ్.. శుక్రవారం రాత్రి ఆ పదవికి రాజీనామా చేశారు. రాత్రి 11 గంటల సమయంలో డెహ్రాడూన్‌లోని రాజ్‌భవన్ వద్ద గవర్నర్ బేబీ రాణిమౌర్యకు రాజీనామాపత్రాన్ని అందజేశారు. రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు ఆయన రాజీనామా చేశారు.
పౌరి గర్హ్వాల్ నుంచి లోక్‌సభకు ఎంపిక ఆయన.. ఆరు నెలల్లోగా అంటే.. సెప్టెంబర్ 10వ వరకు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. గడువు ముగిసేవరకు పదవిలో కొనసాగితే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే రాజీనామా చేయడమే ఉత్తమ మార్గమని భావించారు. ఉత్తరాఖండ్‌లో రెండు శాసనసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేకపోవడంతో ఆయన రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

