Nominations | కాసిపేట, డిసెంబర్ 1 : కాసిపేట మండలంలో రెండో రోజు సోమవారం 22 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. రెండో రోజు మొత్తం ఏడు నామినేషన్ కేంద్రాల్లో 22 సర్పంచ్ స్థానాలకు 32 నామినేషన్లు పడ్డాయి. 190 వార్డు స్థానాలకు 70 నామినేషన్లు పడ్డాయి.
బుగ్గగూడెం (కే)లో సర్పంచ్ 1, వార్డులకు 2, చిన్న ధర్మారంలో సర్పంచ్ 1, దేవాపూర్ లో సర్పంచ్ కు 5, వార్డులకు 12, కాసిపేటలో సర్పంచ్ కు 1, వార్డులకు 3, కోమటిచేనులో సర్పంచ్ 4, వార్డులకు 2, కొండాపూర్ లో సర్పంచ్ 2, వార్డులకు 1, లంబాడితండా(డీ)లో సర్పంచ్ కు 2, వార్డులకు 10, లంబాడితండా (కే)లో సర్పంచ్ 1, వార్డులకు 1, మద్దిమాడలో సర్పంచ్ కు 3, వార్డులకు 7, ముత్యంపల్లిలో సర్పంచ్ 1, వార్డులకు 2, పల్లంగూడలో సర్పంచ్ 3, వార్డులకు 8, పెద్దనపల్లిలో సర్పంచ్ 2, వార్డులకు 6, రొట్టెపల్లిలో సర్పంచ్ 2, వార్డులకు 6, సోమగూడెం (కే)లో సర్పంచ్ 1, వార్డులకు 1, తాటిగూడలో సర్పంచ్‌కు2, వార్డులకు 9, వెంకటాపూర్ లో సర్పంచ్ 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆయా గ్రామ పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు