Durgam Chinnaiah | తాండూర్, డిసెంబర్ 10 : బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తాండూర్ మండలం బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం మంగళవారం రాత్రి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులకోసం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించాలని కోరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన వాగ్దానాలు మర్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని ఆరోపించారు.
మరోమారు బూటకపు వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నారని, అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిన ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని దుర్గం చిన్నయ్య కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్, వార్డు సభ్యులుగా బరిలో ఉన్న అభ్యర్థులు, తదితరులున్నారు.
Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!