Fire accident : టెక్స్టైల్ (Textile) మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. ఏకంగా ఆ టెక్స్టైల్ దుకాణ సముదాయంలోని 20కి పైగా షాపులకు మంటలు అంటుకున్నాయి. గుజరాత్ (Gujarat) రాష్ట్రం సూరత్ (Surat) నగరంలోని పర్వత్ పటియా (Parvat Patia) ఏరియాలోగల రాజ్ టెక్స్టైల్ మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఏడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
భవనం మొదటి అంతస్తు లిఫ్టులో చెలరేగిన మంటలు వేగంగా ఏడో అంతస్తు వరకు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో ఏకంగా నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
VIDEO | Gujarat: Fire breaks out at Raj Textile Market in Surat. More details are awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/PeZcyhVFx0
— Press Trust of India (@PTI_News) December 10, 2025