Urea | జైనూర్, జూలై 08 : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎరువుల కోసం రైతులకు పడిగాపులు తప్పట్లేదు. కొన్ని చోట్ల రైతులు క్యూలైన్లో నిలబడి గంటల తరబడి ఎదురుచూస్తున్నా యూరియా అందడం లేదు.
యూరియా మా రైతులకు ఇవ్వరా అంటూ మంగళవారం జైనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటానని కల్లబొల్లి మాటలు చెప్పి రైతుల అవసరాలను తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రైతులు, మహిళలు నినాదాలు చేశారు.
గత వారం రోజులుగా యూరియా వాహనాలు వచ్చినా మాకు మాత్రం యూరియా అందడం లేదని వెంటనే గిరిజన రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. జైనూర్ మండలంలో యూరియా సరఫరా సక్రమంగా నిర్వహించడం లేదని.. యూరియా సక్రమంగా సరఫరా చేసి రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు