హెచ్‌సీఏ కోశాధికారి పోస్ట్‌కు ఎన్నిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోశాధికారి పదవికి ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ల విత్‌డ్రాకు ఆఖరి రోజైన మంగళవారం పోటీలో ఉన్న వారి జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్ విడుదల చేశారు. ఇందులో బాబురావు, అనిల్‌కుమార్, హరినారాయణరావు, ఆగమ్‌రావు పోటీలో ఉన్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోశాధికారి పదవికి ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ల విత్‌డ్రాకు ఆఖరి రోజైన మంగళవారం పోటీలో ఉన్న వారి జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్ విడుదల చేశారు. ఇందులో బాబురావు, అనిల్‌కుమార్, హరినారాయణరావు, ఆగమ్‌రావు పోటీలో ఉన్నారు. నలుగురు బరిలో ఉండటంతో ఈనెల 15వ తేదీన ఎన్నిక నిర్వహిస్తున్నట్లు సంపత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు హెచ్‌సీఏలో కార్యదర్శి పదవి ఏకగ్రీవమైంది. పోటీలో ఉన్న మిగతా సభ్యులు తమ నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవడంతో ఎమ్ జీవన్‌రెడ్డి ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దేవరాజ్, సీజే శ్రీనివాస్ పదవికాలం ముగియడంతో రెండు స్థానాల కోసం ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
హెచ్‌సీఏలో ఎన్నికల చిత్రం!
హెచ్‌సీఏలో ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు మాజీ అధ్యక్షుడిపై ఆరోపణలు రుజువు కాకముందే అతని తర్వాత స్థానంలో నిలిచిన అమర్నాథ్ను పీఠంపై కూర్చోబెట్టిన హెచ్‌సీఏ..ఖాళీ అయిన కార్యదర్శి, కోశాధికారి పదవులకు మాత్రం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. అధ్యక్ష పదవి తరహాలోనే కార్యదర్శి, కోశాధికారులను నియమించవచ్చు కదా పలు క్లబ్‌ల కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. అమర్నాథ్ ఎన్నికపై ఓవైపు కోర్టులో కేసు నడుస్తుండగానే విశాకకు నిధుల మళ్లింపు సంచలనం కల్గించింది. ఈ విషయంలో హైకోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ నవీన్‌రావు దృష్టికి రాకుండానే నిర్ణయాలు జరిగినట్లు పలువురు వాపోతున్నారు. మొత్తంగా హెచ్‌సీఏ క్రికెట్ అభివృద్దికి కృషి చేయాల్సిందిపోయి..అందినకాడికి దోచుకోవడమే లక్ష్యం గా.. సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

