e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News అన్నదాతకు అండ‌గా వ‌రంగ‌ల్ జిల్లా మ‌హిళ‌లు.. ఏం చేస్తున్నారంటే..

అన్నదాతకు అండ‌గా వ‌రంగ‌ల్ జిల్లా మ‌హిళ‌లు.. ఏం చేస్తున్నారంటే..

వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్నది. పోనీ యంత్రాలతో సాగు చేద్దామంటే నిధుల కొరత. దీంతో రైతులు పరిస్థితులతో రాజీపడుతూ అత్తెసరు దిగుబడితో సర్దుకుపోతున్నారు. ఈ సమస్యకు చెన్నారావుపేట కేంద్రంగా ఏర్పాటైన ‘అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య’ ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. మార్కెట్‌తో పోలిస్తే.. తక్కువ ధరకు ఆధునిక వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇస్తున్నది. ఫలితంగా రైతుకు కష్టం తప్పింది. సంఘానికి రాబడి పెరిగింది.

వ్యాపారం అంటే మనం బాగుపడటమో, ఎదుటివారు బాధపడటమో కాదు. మనం బతకాలి. నలుగురినీ బతికించాలి. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని మహిళా రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యల సభ్యులు ఎంచుకున్న మార్గమూ అదే. కాబట్టే, వ్యవసాయ ఉపకరణాల అద్దె కేంద్రాన్ని ఒంటిచేత్తో నిర్వహిస్తున్నారు. మార్కెట్‌తో పోలిస్తే కిరాయి తక్కువ. దీంతో, రైతుకు చాలా కష్టాలు తప్పాయి. ఒక్క ఏడాదిలోనే రూ.8.64 లక్షల ఆదాయం సమకూరింది. అంతేకాదు, రాబడి (టర్నోవర్‌)లోనూ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించారు. చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లో 110 మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సమర్థంగా పనిచేస్తున్నాయి. వీటిలో 1,799 మంది సభ్యులు ఉన్నారు. అంతా కలిసి అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నారు. ప్రయోగాత్మకంగా చెన్నారావుపేటలోని ఆశాజ్యోతి మండల సమాఖ్య కార్యాలయంలో.. ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వం గ్రాంటు కింద రూ.25 లక్షలు ఇచ్చింది. ఈ నిధులతో ట్రాక్టర్‌, ట్రాలీ, కల్టివేటర్‌, రొటోవేటర్‌, కాటన్‌ చాపర్‌, పవర్‌ వీడర్‌, ప్యాడీ బేలర్‌, బ్రేష్‌ కట్టర్‌, మేజ్‌, బ్యాటరీ స్ప్రేయర్‌, తైవాన్‌ స్ప్రేయర్‌, సీడ్‌ కమ్‌ ఫర్టిలైజర్‌ డ్రిల్‌ వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేసి.. రైతన్నలకు అందుబాటులోకి తెచ్చారు.

అంతా అక్షయ సభ్యులే

- Advertisement -

అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్యలోని 1,799 మంది సభ్యులూ చెన్నారావుపేట, నెక్కొండ మండలాల మహిళలే. అందరివీ రైతు కుటుంబాలే. వీరంతా అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య అద్దె ఉపకరణాలను ఉపయోగించుకుంటున్నారు. ఎన్ని అభ్యర్థనలు వచ్చినా.. అద్దెకు ఇవ్వటంలో సమాఖ్య సభ్యులకే తొలి ప్రాధాన్యం. పనిముట్లు అవసరమైన రైతులు అక్షయ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవచ్చు. అందుబాటును బట్టి, సమాఖ్య మేనేజరు తమ డ్రైవర్‌ ద్వారా ఉపకరణాలను పంపుతారు. చక్కని సమన్వయం కారణంగా ఎక్కడా ఇబ్బంది ఉండదు. ‘రైతులకు సకాలంలో ఆధునిక వ్యవసాయ పనిముట్లను అద్దెకు అందజేస్తున్నం. బయటి రేట్లకంటే తక్కువ అద్దెపై సేవలు ఇస్తున్నం.

మా సమాఖ్య ద్వారా రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం మా అదృష్టం’ అంటారు అక్షయ సభ్యురాలు వర్దెల్లి భాగ్య. నిజమే, అన్నదాతకు అక్షయపాత్ర కావడం ఓ వరమే.

..✍ వేముల రాజేశ్వరరావు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆస్ట్రేలియా స్థానిక‌ ఎన్నిక‌ల్లో గెలిచిన తెలంగాణ ఆడ‌బిడ్డ‌.. ఆమె విజ‌య ర‌హ‌స్య‌మిదే..

gauthami jeji | బొల్లి మ‌చ్చ‌లు ఉన్నాయ‌ని కుంగిపోలేదు.. మోడ‌లింగ్‌లో అద‌ర‌గొడుతుంది..

Keerthi priya | రైత‌న్న‌ల‌కు అండ‌గా సూర్యాపేట యువ‌తి.. ఇంత‌కీ ఆమె ఏం చేస్తోందంటే..

nalli fashions | తాత‌ల నుంచి చేస్తున్న చీర‌ల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది

Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Gray hair | చిన్న‌వ‌య‌సులోనే త‌ల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్‌స్పిరేష‌న్‌.. ఎందుకంటే?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement