e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Vijayalakshmi | చదివింది పదో తరగతి. కానీ, ఎంబీయేలకు మార్కెటింగ్‌ పాఠాలు చెప్పగలదు. పుట్టింది గ్రామీణ ప్రాంతంలో. అయితేనేం, నిఫ్ట్‌ డిజైనర్లకు ఫ్యాషన్‌ సూత్రాలు బోధించగలదు. ఒకప్పుడు బస్సు ప్రయాణమైనా ఖరీదైన వ్యవహారమే. ఇప్పుడు అంతర్జాతీయ విమానాల్లో ప్రపంచమంతా చుట్టొస్తున్నది. కొయ్యలగూడెంలో మొదలైన వర్కాల విజయలక్ష్మి సామాజిక వ్యాపారం నేడు మూడొందల మందికి ఉపాధినిస్తున్నది.

Vijayalakshmi
Vijayalakshmi

వర్కాల విజయలక్ష్మి స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని కొయ్యలగూడెం. పదో తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత పెండ్లి చేశారు. పెండ్లయిన కొత్తలో భర్త వృత్తికి చేదోడు వాదోడుగా ఉండేది. మొగుడు, మామ నేత పనిచేస్తేనే ఇల్లు గడిచేది. వస్త్ర పరిశ్రమలో యంత్రాల ప్రభావం, ఆధునికత కారణంగా నేతకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీంతో ఇల్లు గడవడమే కష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఆమెలో అంతర్మథనం మొదలైంది. తనవంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపన నిద్రపోనివ్వలేదు. అండ కోసం మహిళా స్వయం సహాయక సంఘంలో చేరింది. క్రమంగా అదే సంఘానికి అధ్యక్షురాలు అయ్యింది. ఆమె ఉత్సాహాన్ని, ఆసక్తిని గమనించిన సెర్ప్‌, డీఆర్‌డీఏ అధికారులు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ద్వారా విజయ
లక్ష్మికి మూడు నెలలు శిక్షణ ఇచ్చారు. ఆ పాఠాలు ఆమెకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి.
ఇప్పుడు విజయలక్ష్మి 300 మందికి ఉపాధి కల్పిస్తున్నది. గాగ్రాలు, డ్రెస్‌ మెటీరియల్‌ రూపకల్పన, చీరలపై అందమైన డిజైన్లు సృష్టించడం, బ్యాగుల తయారీ.. ప్రతి బాధ్యతా ఆమె దృష్టిలో ఓ తపస్సే. వినూత్నమైన ఆలోచనలు, నాణ్యమైన పనితనం, సకాలంలో డెలివరీ .. ఈ మూడు విషయాల్లో విజయలక్ష్మి రాజీపడదు. క్రమంగా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరింది వ్యాపారం. నేడు ‘విజయలక్ష్మి ఇక్కత్‌ ఫ్యాబ్‌’ వార్షిక టర్నోవర్‌ రూ.4 కోట్ల పైమాటే.

Vijayalakshmi
Vijayalakshmi

నేతన్నల కుటుంబం…

- Advertisement -

అత్తింటి వైపు, పుట్టింటి వైపు.. విజయలక్ష్మిది చేనేత కుటుంబమే. అందులోనూ కొయ్యలగూడెం ఇక్కత్‌కు ప్రసిద్ధి. దీంతో చాలామంది విదేశీయులు వచ్చేవారు. అప్పట్లో ఇక్కడ ఫ్యాబ్రిక్‌ను మాత్రమే విక్రయించేవారు. దీంతో అంతంతమాత్రంగా డబ్బులు వచ్చేవి. పట్టణ ప్రాంత మహిళల్లో
చీర అలవాటు తగ్గడంతో.. ఆ ప్రభావం వ్యాపారం మీద పడింది. ఆమె భర్త విజయ్‌ కుమార్‌ అప్పట్లోనే ఢిల్లీ, ముంబయి వెళ్లి సరుకు అమ్మేవారు. ఆ అనుభవం ద్వారా వస్ర్తాలను తయారు చేయడమే కాదు, వాటి మార్కెటింగ్‌ కూడా ముఖ్యమని విజయలక్ష్మి గుర్తించింది. పరిధిని విస్తరించుకోవాలంటే కొత్త డిజైన్లు అవసరమని అర్థమైంది. ఆ ప్రయత్నంలో హైదరాబాద్‌లోని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ను సంప్రదించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే వస్త్ర ప్రదర్శనల్లో పాల్గొనేది. ఇప్పటికీ ప్రదర్శనలకు హాజరు అవుతూనే ఉంటుంది. దీనివల్ల కొనుగోలుదారుల అభిరుచులను అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. తన సంస్థ ద్వారా దుప్పట్లు, చీరలు, బెడ్‌ స్ప్రెడ్స్‌, దివాన్‌ కవర్లు, దిండు కవర్లు విక్రయిస్తుందామె. ఫ్యాబ్‌ ఇండియా, బీబా, టెస్కో తదితర సంస్థల నుంచి టోకుగా ఆర్డర్లు వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా కొనుగోలు చేస్తాయి. అనేక సుప్రసిద్ధ బ్రాండ్లకూ వస్త్రాలను సరఫరా చేస్తున్నది విజయలక్ష్మి.

Vijayalakshmi
Vijayalakshmi

అంతర్జాతీయంగా మలేషియా, శ్రీలంక, ఇటలీ, చైనా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో జరిగిన అనేక వస్త్ర ప్రదర్శనల్లో పాల్గొన్నది విజయలక్ష్మి. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్దమ్మాయి సివిల్స్‌కు సిద్ధం అవుతున్నవారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతుంది. చిన్నమ్మాయి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేస్తున్నది. అబ్బాయి కాగ్నిజెంట్‌లో కొలువు చేశాడు. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. తనయుడి సాయంతో, మధ్యవర్తుల అవసరం లేకుండానే విదేశాలకు సరుకులను ఎగుమతి చేయాలన్నది ఆమె ఉద్దేశం. దీనివల్ల నేతన్నకూ లాభమే. ‘ఏ అమెరికాకో వెళ్తున్నప్పుడు విమానం గాల్లో ఎగిరిన ప్రతిసారీ.. ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. నేల మీద నిలబడి ఆశగా ఆకాశం వైపు చూసిన నేనేనా? అనుకుంటాను’ అంటారామె.

Vijayalakshmi
Vijayalakshmi

.. ✍ నెలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

shaik saleema | తెలంగాణ‌లో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ స‌లీమా రికార్డ్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..

Saami Saami | పుష్ప‌లో సామీ సామీ పాట పాడిన మౌనిక‌కు ఇన్‌స్పిరేష‌న్ ఈమెనే

విదేశాల‌కూ తెలంగాణ రుచుల‌ను అందిస్తున్న క‌రీంన‌గ‌ర్ మ‌హిళ‌లు

మూడేండ్ల క్రితం దాకా టీ పెట్ట‌డం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్ట‌ర్ చెఫ్‌

sheela bajaj | 78 ఏండ్ల వ‌య‌సులో వ్యాపారం మొద‌లుపెట్టిన బామ్మ‌

వైక‌ల్యం వారి ప్ర‌తిభ‌కు అడ్డం కాలేదు.. మోడ‌లింగ్‌లో దూసుకెళ్తున్న కేర‌ళ యువ‌తులు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement