వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు

physically challenged models | ‘వైకల్యం శరీరానికే కానీ, మనసుకు కాదు’ అంటున్నారు కేరళకు చెందిన ఈ దివ్యాంగ మోడల్స్. అందం, అంగసౌష్టవం ఉన్నవారికే మోడలింగ్ అన్న గీతను చెరిపేశారు. విభిన్న రంగాన్ని ఎంచుకొని దివ్యాంగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పాతు ఫాతిమా ( paathu fathima ), రెమ్యా గణేశ్ ( Remya ganesh ).
కేరళకు చెందిన ఫాతిమా పుట్టుకతో దివ్యాంగురాలు కాదు. ఇప్పుడు ఆమె వయసు 20 ఏండ్లు. అంతుచిక్కని వ్యాధి ఆమె కాలును తొలిచివేసింది. 17 ఏండ్లు ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి కుడికాలును తొలగించారు. ఆమె కుంగిపోలేదు. కృత్రిమ కాలు అమర్చుకొని పట్టుదలతో అడుగులు వేసింది. తన ఆశలకు రెక్కలు తొడిగింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది. వీటితోపాటు ఫొటోషూట్లు చేస్తూ, మోడలింగ్‌లో సత్తా చాటుతున్నది. కృత్రిమ కాలుతోనే ఎన్నో ర్యాంప్షోల్లో క్యాట్‌వాక్ చేసి హ్యాట్సాఫ్ అనిపించుకుంది. ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌వీక్ గోవాలో నిర్వహించిన పోటీలో 2021 ఆసియా ఫ్యాషన్ అవార్డును కైవసం చేసుకుంది ఫాతిమా. 2019 నుంచి ఇప్పటికి 20కిపైగా ఫొటోషూట్లు చేసింది.

కోజికోడ్‌కు చెందిన 32 ఏండ్ల రెమ్యా గణేశ్‌కు తొమ్మిది నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు పోలియో టీకా వికటించి కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆమె బాల్యమంతా భారంగానే గడిచింది. 14వ ఏట పదో తరగతిలో ఉండగా తండ్రి చనిపోవడంతో చదువూ ఆగిపోయింది. తర్వాత కొన్నాళ్లకు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కంప్యూటర్, వ్యక్తిత్వ వికాస కోర్సులకు హాజరై తన జీవితాన్ని తిరిగి ప్రారంభించింది రెమ్యా. సాక్షరత మిషన్ ద్వారా చదువుకొని మంచి గ్రేడ్‌తో పది పాసైంది. ప్రస్తుతం కోజికోడ్‌లోని మలబార్ క్రిస్టియన్ కాలేజ్‌లో డిగ్రీ చదువుతూ.. మోడల్‌గా రాణిస్తున్నది. 2019లో కోజికోడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియేటివ్ మెడిసిన్ నిర్వహించిన ‘క్యూరియస్’ కార్నివాల్లో తన ప్రతిభ చూపింది. అప్పుడే ‘కేరళకు చెందిన మొదటి వీల్‌చైర్ మోడల్’గా ఖ్యాతిగాంచింది. అప్పటినుంచి పలు మలయాళ మ్యాగజైన్ల కోసం ఫొటోషూట్‌లో పాల్గొంటున్నది. లోపాన్ని శాపంగా భావించకుండా ఫాతిమా, రెమ్యా విభిన్న రంగాలు ఎంచుకొని రాణిస్తున్నారు. దివ్యాంగుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే తమ లక్ష్యం అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
gongadi trisha | క్రికెట్లో యువ సంచలనం మన తెలంగాణ అమ్మాయి త్రిష..
Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావర్కర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్యమైంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

