e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News భీమ్లా నాయ‌క్ సినిమాలో పాట పాడిన దుర్గ‌వ్వ ఎవ‌రో తెలుసా

భీమ్లా నాయ‌క్ సినిమాలో పాట పాడిన దుర్గ‌వ్వ ఎవ‌రో తెలుసా


Singer durgavva | పాటతో పుట్టింది. పాటతో పెరిగింది. కష్టమొచ్చినా పాటే. సంతోషం అనిపించినా పాటే. ఆ పాట ఆమెను ఎల్లలు దాటించింది. ఏరువాక నుంచి ఎన్నీల వెలుగు చెంతన చేరుస్తూ భీమ్లా నాయక్‌ ( Bheemla nayak )కు పరిచయం చేసింది. పాటకు పరవశిస్తూ.. ప్రణమిల్లుతూ.. కష్టాన్ని తలుచుకొని చెమ్మగిల్లుతున్న ఆ పల్లె పదాల సంతకం.. కుమ్మరి దుర్గవ్వ పాట ముచ్చట!

Singer durgavva


‘భీమ్లా నాయక్‌ సినిమా కోసం పాట పాడాలె దుర్గవ్వా!’ అని పిలిస్తే నేను నమ్మలేకపోయిన. పాడుతున్నంత సేపు ‘సినిమాకు కాకుండొచ్చులే’ అనుకున్న. తర్వాత తెలిసింది, నేను పాడింది పెద్ద సినిమాకు అని.. దాంట్లో హీరో పవన్‌ కల్యాణ్‌ సార్‌ అని. ఒకరకంగా ఇది నా అదృష్టం. పాటను నమ్ముకున్నందుకు ఈ అవకాశం దక్కిందేమో. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి. చిన్నతనం నుంచే పాడేదాన్ని. ఇప్పటిలెక్క ఫోన్లెక్కడివి? కంప్యూటర్లెక్కడివి? ఏది నోటికొస్తే అది పాడుతుండె. ఊర్లల్ల కథలు చెబుతూ, బాగోతాలు ఆడుతుండేటోళ్లు. బాలసంతులు, గంగిరెద్దులోళ్ల దగ్గర కూడా మంచి పాటలు ఉంటుండె. అక్కడా ఇక్కడా విని మేం పాడెటోళ్లం. నాకు ఎక్కువగా సువ్వి పాటలు, బతుకమ్మ పాటలు వస్తయి. పాట నాకు తోడుకావడానికి ఓ కారణం ఉన్నది. నాకు ఇద్దరు పిల్లలు.. శైలజ, ప్రభాకర్‌. పిల్లల చిన్నతనంలనే వాళ్ల నాయిన రాజన్న కాలం చేసిండు. బాధ్యత నా మీద పడ్డది. మగదిక్కు లేని ఇల్లు. చానా కష్టాలు పడ్డా. ఆ కన్నీళ్లలో పాట నాకు సోపతైంది. గుండె బరువు దింపుకొనేందుకు పాడటం మొదలుపెట్టిన.

మస్తు గోసవడ్డం

- Advertisement -

ఇల్లు లేదు, వాకిలి లేదు. కూలి చేసుకుంటేనే పూట గడిచేది. ఉన్న మూడెకరాల భూమిని పాలోళ్లు లాక్కున్నరు. మా కష్టాలను చూసి ఓదార్చడానికి ఎవరైనా వస్తే వాళ్లనూ బూతులు తిట్టేటోళ్లు. దీంతో ఊర్లో ఎవరూ మా ఇంటికి రాకపోతుండె. మేమూ ఎవరి దగ్గరికి పోకపోదుము. ఏవైనా కార్యాలు జరిగినా వెళ్లకపోతుంటిమి. చేసేదేమీ లేక బిక్కుబిక్కుమంటూ పిల్లలను తీసుకొని మా అమ్మగారింటికి పోయిన. పిల్లలకు ఆకలైతే ఆ ఇల్లూ ఈ ఇల్లూ తిరిగి అడుక్కొని తినేది. అయినా నేను ధైర్యం తప్పలేదెన్నడూ. న్యాయంగా పోరాడి రెండెకరాలు రాబట్టిన. ఇంకో ఎకరం రావాలె.

‘భీమ్లా నాయక్‌’లో అవకాశం

‘ఉంగురం’ పాట మంచిగ రావడంతో, ఆ పాట తీసిన నరేశ్‌కు భీమ్లా నాయక్‌ సినిమా వాళ్లు ఫోన్‌ చేసిండ్రంట. నరేశ్‌ మా బిడ్డెకు విషయం చెప్పిండు. తర్వాత ‘ఏం దుర్గవ్వా భీమ్లా నాయక్‌ సినిమాకు పాడుతవా’ అనే మాట వినిపించగానే నాకు మస్తు సంబురమైంది. నిజమా? కలనా? అనిపించింది. ‘సెబుతున్న నీ మంచి సెడ్డా ఆంతోని పంతాలకు పోబాకు బిడ్డా.. సిగురాకు సిట్టడివి గడ్డా.. చిక్కుల్లో అట్టుడికి పోరాదు బిడ్డా’ అంటూ సాగుతది పాట. నన్నిప్పుడు చానా మంది భీమ్లా నాయక్‌ దుర్గవ్వ అనే పిలుస్తరు. పవన్‌ కల్యాణ్‌ సార్‌కు, తమన్‌ సార్‌కు, సాగర్‌ సార్‌కు రుణపడి ఉంటా. నా పాట ప్రపంచానికి తెలిసినందుకు సంతోషంగా ఉంది. ఒంటరి పోరాటం చేస్తున్న నాకు పవన్‌ కల్యాణ్‌ సార్‌ లాంటి పెద్దోళ్లు సాయంచేస్తే అదే పదివేలు.

ఉంగురం పాటతో

నేను సేకరించి పెట్టుకున్న పల్లె పాటలు చాలా ఉన్నయి. నా గొంతును, పాట తీరును చూసి వాళ్లూ వీళ్లూ వచ్చి పాడిస్తరు. ఫోన్లల్ల నింపుతరు. ఆనోటా ఈనోటా నేను మంచిగ పాడుతనని తెలుసుకొని రాజశేఖర్‌ ఆర్‌ఎం ‘సిరిసిల్ల సిన్నది’ జానపదం పాడమని అడిగిండు. పాట రిలీజైనంక మంచి పేరొచ్చింది. ఎవ్వరి ఫోన్లల్ల చూసినా నా పాటనే. ఒకరిద్దరు అడిగితే, ‘ఊరెనకా దున్నిచ్చి ఉల్లినాటేసి ఉంగూరమే రంగైన రాములాల టుంగూరమే’ పాట వినిపించిన. నచ్చడంతో వెంటనే షూటింగ్‌ చేసిండ్రు. యూట్యూబ్‌లో లక్షల మంది చూసిండ్రు.

✍ తొలుపునూరి యువరాజ్‌ గౌడ్‌

ఫొటోలు : వర్షిణి శ్రీనివాస్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు : ఇండియ‌న్ ఐడ‌ల్ సింగ‌ర్ ష‌ణ్ముఖ ప్రియ‌

అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావ‌ర్క‌ర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్య‌మైంది?

rema rajeshwari | ఫోర్బ్స్‌ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్‌

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement