e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ఆస్ట్రేలియా స్థానిక‌ ఎన్నిక‌ల్లో గెలిచిన తెలంగాణ ఆడ‌బిడ్డ‌.. ఆమె విజ‌య ర‌హ‌స్య‌మిదే..

ఆస్ట్రేలియా స్థానిక‌ ఎన్నిక‌ల్లో గెలిచిన తెలంగాణ ఆడ‌బిడ్డ‌.. ఆమె విజ‌య ర‌హ‌స్య‌మిదే..

Sandhya Reddy | ఆస్ట్రేలియా. సిడ్నీ నగరం. స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌ ఎన్నికలు. పాతిక వేల ఓటర్లు. హోరాహోరీ పోరాటం. రాజకీయ పార్టీల ప్రాబల్యం. ఉత్కంఠ భరితమైన ఆ స్థానిక పోరులో తెలంగాణ ఆడబిడ్డ, స్వతంత్ర అభ్యర్థి పట్లోల్ల సంధ్యారెడ్డిదే అంతిమ విజయం. ‘నేను చేపట్టిన సేవా కార్యక్రమాలే నన్ను గెలిపించాయి’ అంటూ సంధ్యారెడ్డి ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..

Sandhya Reddy
Sandhya Reddy

మాది ఖైరతాబాద్‌. సరళారెడ్డి, పట్లోల్ల శంకర్‌రెడ్డి అమ్మానాన్నలు. అబిడ్స్‌లోని స్టాన్లీ స్కూల్‌లో చదువుకున్నా. మా అమ్మ కూడా ఇదే స్కూల్లో చదివారు. మెహిదీపట్నం సెయింట్‌ ఆన్స్‌లో డిగ్రీ చేశాను. కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్నా. ఆస్ట్రేలియాలో స్థిరపడిన కర్రి బుచ్చిరెడ్డితో నా పెండ్లి జరిగింది. వివాహం తర్వాత ఆయనతో ఆస్ట్రేలియా వచ్చాను. ఇక్కడే మైగ్రేషన్‌ కన్సల్టెన్సీలో డిప్లొమా చేశాను. మాకు ఇద్దరు అబ్బాయిలు.. నీల్‌రెడ్డి, నిఖిల్‌ రెడ్డి. చిన్నోడు 2017లో ఆస్ట్రేలియా చెస్‌ జూనియర్‌ చాంపియన్‌గా నిలిచాడు. భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. ఇద్దరు పిల్లలూ చదరంగంలో 200కు పైగా ట్రోఫీలు సాధించారు.

గర్వంగా ఉంది…

- Advertisement -

వ్యక్తిగతంగా నేను ఎంత సహాయం చేసినా, అది పరిమితంగానే ఉంటుంది. ప్రజా ప్రతినిధిగా ఎన్నికైతే ఓ వ్యవస్థ మన వెనుక నిలబడుతుంది. ప్రభుత్వ అండ లభిస్తుంది. మరింత ఎక్కువ
మందికి సాయం చేయగలుగుతాం. చేసే పనికీ గుర్తింపు వస్తుంది. ఆ ఉద్దేశంతోనే లోకల్‌ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎంతోమంది సహాయ సహకారాలు, ప్రోత్సాహం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. స్ట్రాత్‌ఫీల్డ్‌ మున్సిపాలిటీ చాలా పెద్దది. దాదాపు 50 వేల జనాభా ఉంటుంది. 25 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కలిసి ఏడుగురు కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకుంటారు. స్వతంత్ర అభ్యర్థిగా లేబర్‌, లిబరల్‌ పార్టీ అభ్యర్థులను ఓడించి మరీ ఇక్కడ విజయం సాధించాను. ముగ్గురు అభ్యర్థులు లేబర్‌ పార్టీ తరఫున గెలుపొందారు. మిగతా నలుగురు స్వతంత్రులు. వారిలో నేనొకదాన్ని. మూడు సంవత్సరాల పాటు పదవిలో ఉంటాం. భారతీయ యువతిగా నా గొంతు వినిపించే అవకాశం ఉందిక్కడ. ఎన్నికల వాతావరణం విషయంలో భారత్‌కూ, ఇక్కడికి చాలా తేడా ఉంటుంది. ఆస్ట్రేలియాలో ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులకు కౌన్సిల్‌ వాళ్లే 20 వేల డాలర్లు ఇస్తారు. ఇప్పటివరకు నేను చేసిన సేవా కార్యక్రమాలే నన్ను గెలిపించాయి. ఓటర్లంతా ఏదో ఒక రూపంలో నాకు పరిచయం ఉన్నవారే కావడంతో నా గెలుపు సులభం అయ్యింది. మా ప్రాంతంలో 10 శాతం మంది భారతీయులే.

సేవా కార్యక్రమాలు…

ఇంటర్‌లో ఉండగానే నేను ఇంట్లో చెప్పకుండానే రక్తదానం చేశాను. ఇక్కడికి వచ్చాక కూడా కొన్ని సంవత్సరాలపాటు వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నా భర్త బుచ్చిరెడ్డి ప్రోత్సాహంతో సొంతంగా సామాజిక సేవ చేపట్టాను. క్రమంగా వాటిని విస్తరించుకుంటూ వచ్చాను. స్ట్రాత్‌ఫీల్డ్‌కు వలస వచ్చేవారికి నా వంతు సాయం చేస్తాను. అన్నివేళలా అందుబాటులో ఉంటాను. ఇక్కడ స్థిరపడే వరకు అన్ని విధాలా సహకరిస్తాను. స్కూల్‌ అడ్మిషన్ల విషయంలో ఇబ్బంది కలగకుండా చూస్తాను. సాటి మనిషిగా ఇది నా బాధ్యత కూడా.

బతుకమ్మ అంటే ఇష్టం

బతుకమ్మ నాకు ఇష్టమైన పండుగ. ఆస్ట్రేలియాకు వచ్చినప్పటి నుంచీ ఏటా బతుకమ్మను చేస్తున్నాను. సద్దుల బతుకమ్మ ప్రసాదం వండి, అందరికీ పంచుతాను. దాదాపు వేయి మందితో వేడుక నిర్వహిస్తాను. మా పిల్లలు పూర్తిగా స్థిరపడ్డాక… తెలంగాణలో ఏదైనా ఒక బడిని దత్తత తీసుకోవాలని అనుకుంటున్నా. తెలంగాణ వాళ్లు కలిసినప్పుడు పూర్తిగా మన యాసలోనే మాట్లాడతాను. యాస, భాష, సంస్కృతి.. ఏ దేశమేగినా మన వెంట వచ్చే ఆస్తులు ఇవే.

…✍ నెలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

Keerthi priya | రైత‌న్న‌ల‌కు అండ‌గా సూర్యాపేట యువ‌తి.. ఇంత‌కీ ఆమె ఏం చేస్తోందంటే..

nalli fashions | తాత‌ల నుంచి చేస్తున్న చీర‌ల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది

Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Gray hair | చిన్న‌వ‌య‌సులోనే త‌ల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్‌స్పిరేష‌న్‌.. ఎందుకంటే?

shaik saleema | తెలంగాణ‌లో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ స‌లీమా రికార్డ్‌.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..

Saami Saami | పుష్ప‌లో సామీ సామీ పాట పాడిన మౌనిక‌కు ఇన్‌స్పిరేష‌న్ ఈమెనే

విదేశాల‌కూ తెలంగాణ రుచుల‌ను అందిస్తున్న క‌రీంన‌గ‌ర్ మ‌హిళ‌లు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement