gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్‌లో అదరగొడుతుంది..

gauthami jeji | మోడలింగ్ అంటేనే అందం, శరీర సౌష్టవం, అబ్బురపరిచే ఫ్యాషన్. ఈ ఆత్మ విశ్వాసానికి మోడల్మూడింటిలో ఏది తక్కువైనా ఆ హోదాకు అనర్హులే. ముఖంమీద చిన్న మచ్చ ఉన్నా, ఫ్యాషన్ షోల దరిదాపుల్లోకి కూడా రానివ్వని ఈ రోజుల్లో .. పుట్టుకతోనే ‘ల్యుకో డెర్మా’ (బొల్లి) సమస్య ఉన్న ఈ యువతి ర్యాంప్‌లను షేక్ చేస్తున్నది.

గౌతమి జెజీ.. భారతీయ ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త కెరటం. చిన్నచిన్న లోపాలకే కుంగిపోతూ, బయటికి రావాలంటేనే భయపడిపోయే ఎంతోమంది యువతులకు తనే స్ఫూర్తి. బెంగళూరుకు చెందిన గౌతమి మోడలింగ్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మొదట్లో, ముఖం మీదున్న బొల్లి మచ్చలు తనను వికారంగా మార్చేశాయని బాధపడేది. ఆ మచ్చలు కనిపించకుండా మేకప్‌తో కప్పేసేది. అయినా ఫలితం లేకపోయింది. ఇక ఆ ప్రయత్నం ఆపేసింది. తనలానే చర్మ సమస్యతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నది. ఎలాంటి మేకప్ లేకుండానే ఫొటోలు పోస్టు చేసింది. గౌతమి పోస్టులను ఇన్‌స్టాలో చూసిన నింజాస్ సంస్థ.. ఆమెకు మోడల్‌గా అవకాశం ఇచ్చింది. అప్పటినుంచి సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన గౌతమి.. ప్రతిష్టాత్మక ‘లాక్మే ఫ్యాషన్ వీక్’లో మొదటిసారి ర్యాంప్‌పై నడిచింది. ప్రతి ర్యాంప్ షోలోనూ నిండైన ఆత్మ విశ్వాసంతో దుస్తులను ప్రదర్శించింది. నటిగా, థియేటర్ ఆర్టిస్ట్‌గా, ఇంగ్లిష్ ట్యూటర్‌గా, రచయిత్రిగా, ఆధ్యాత్మిక సలహా దారుగా క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నది గౌతమి జెజీ. ‘డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచనలే నాకు స్ఫూర్తి’ అంటున్న గౌతమి.. ఎంతోమంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాస పాఠం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Keerthi priya | రైతన్నలకు అండగా సూర్యాపేట యువతి.. ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..
nalli fashions | తాతల నుంచి చేస్తున్న చీరల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- fashion
- inspiration
- Pintop1
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

