e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News ఆ విష‌యంలో మా అమ్మ చెప్పినా విన‌ను.. ఓపెన్ అయిన ర‌ష్మిక‌

ఆ విష‌యంలో మా అమ్మ చెప్పినా విన‌ను.. ఓపెన్ అయిన ర‌ష్మిక‌

rashmika_mandanna | కర్ణాటకలోని కూర్గ్‌ చాలా కూల్‌గా ఉంటుంది. అక్కడే పుట్టి పెరిగిన రష్మిక మందన్న కూడా అంతే! ఠండా ఠండా కూల్‌ కూల్‌! ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆమె నవ్వు చల్లని వెన్నెలను పంచుతుంది. అందుకే, వెండితెరపై నిండువెన్నెల జాబిలిలా వెలిగిపోతున్నది రష్మిక. టాలీవుడ్‌లో టాప్‌హీరోల సరసన నటించి మెప్పించిన రష్మిక.. ఇప్పుడు బాలీవుడ్‌లో ఏకంగా బిగ్‌-బి అమితాబ్‌ సినిమాలో చాన్స్‌ కొట్టేసింది. ఈ కన్నడ కస్తూరి పంచుకున్న బీటౌన్‌ కబుర్లు..

బాలీవుడ్‌లో రెండు పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశం దక్కించుకుంది రష్మిక. ‘మిషన్‌ మజ్ను’లో సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన నటిస్తున్నది. ‘కెరీర్‌ తొలినాళ్లలోనే ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. కథ విన్నాక, స్క్రిప్ట్‌ చదివాక.. హీరోయిన్‌ క్యారెక్టర్‌ నాకు బాగా ఫిట్‌ అవుతుందనిపించింది. ఇలాంటి మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

బీటౌన్‌ తొలి సినిమా సెట్స్‌లో ఉండగానే ‘గుడ్‌బై’ రూపంలో మరో అవకాశం రష్మిక తలుపు తట్టింది. అందులో ఏకంగా బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌తో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ‘అమితాబ్‌ గారితో నటించే అవకాశం దొరకడం కన్నా అదృష్టం ఏముంటుంది? దాదాపు 150 పేజీల స్క్రిప్ట్‌ చదివాను. నా పాత్ర ఎంతో నచ్చింది. ఇక సెట్స్‌పైకి వెళ్లాక నా ఆనందానికి అవధుల్లేవు. అమితాబ్‌ సార్‌తో షూటింగ్‌ నా జీవితాంతం గుర్తుండిపోతుంది. పనిలో ఆయన డెడికేషన్‌ నాకెంతో స్ఫూర్తినిచ్చిందం’టూ తన అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంది.

కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ షూటింగ్స్‌ ఉంటే చెప్పిన టైమ్‌కు వెళ్లిపోయేది రష్మిక. ‘షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌కు వెళ్లాల్సిందే! తగిన జాగ్రత్తలు తీసుకునేదాన్ని. పరిస్థితులకు భయపడి, గడపదాటకుండా కూర్చుంటే కుదరదు కదా! సినిమా అంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మనవల్ల ఒక్కరోజు షూటింగ్‌ నిలిచిపోయినా నిర్మాతలు చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో నేను మా పేరెంట్స్‌ మాట కూడా వినను. నా డ్యూటీ అస్సలు మిస్సవ్వను’ అంటుందీ ముద్దుగుమ్మ.

బాలీవుడ్‌ ఎంట్రీకి ముందు ‘టాప్‌ టక్కర్‌’ మ్యూజిక్‌ వీడియోతో మంచి గుర్తింపు సాధించింది రష్మిక. మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్న ఆ పాట బాలీవుడ్‌ ఎంట్రీపాస్‌లా పనికొచ్చిందని టాక్‌. ఈ పాటతో ‘నేషనల్‌ క్రష్‌’ అన్న ముద్దుపేరునూ సంపాదించుకుంది రష్మిక. ‘నిజం చెప్పాలంటే బాలీవుడ్‌లో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాను కానీ, నేను చాలామందికి ముందే తెలుసు. హిందీలోకి డబ్‌ అయిన తెలుగు సినిమాల వల్ల అక్కడా నాకు అభిమానులు ఏర్పడ్డారు’ అంటున్నది ఈ కన్నడ భామ.

ముంబైలో రష్మికకు బిగ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు సినిమాల్లో తను పోషించిన పాత్రల పేర్లతో పిలుస్తారట. అంతగా అభిమానించేవారు ఉన్నారక్కడ. ‘సబ్‌టైటిల్స్‌ మహిమ ఇదంతా! డియర్‌ కామ్రేడ్‌ సబ్‌ టైటిల్స్‌ ఉన్న మూవీ లింక్‌కు మిలియన్‌ హిట్స్‌ రావటం చూసి ఆశ్చర్యపోయా. అక్కడి వాళ్లు మన సినిమాను ఇంత ఆదరించడం క్రేజీగా అనిపించింది. నేను పోషించిన పాత్రల పేర్లతో నన్ను పిలవడం మహా ఆనందాన్నిచ్చింది’ అని చెబుతున్నది రష్మిక.

మంచి సినిమాలే చేస్తా!

ప్రేక్షకులు నేషనల్‌ మూవీస్‌ మాత్రమే చూస్తారని లేదు. మంచి సినిమా అయితే చాలు ఏ భాషకు చెందిన చిత్రాన్నయినా ఆదరిస్తారు. కళకు ప్రాంతం, భాష అనే భేదాలు ఉండవు. నేనయితే ఇవేవీ పట్టించుకోను. ఏ భాషలో అయినా మంచి సినిమాలే చేయాలనుకుంటున్నా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

చీర‌లు అంటే చాలా ఇష్ట‌మే.. కానీ అదొక్క‌టే స‌మ‌స్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేశ్‌

Siri: సిరి ష‌ర్ట్ లోప‌ల చేయి పెట్టిందెవ‌రు.. వీడియో చూపించి గుట్టు విప్పిన‌ నాగ్

MAA Elections 2021 : ఎట్ట‌కేల‌కు మా అధ్య‌క్ష ఎన్నిక‌ల తేదీలు ఖ‌రారు.. మ‌రి కండిష‌న్స్ ఏంటో తెలుసా !

Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!

Idol Winner: ఇద్ద‌రు భార్య‌లు,ఇద్ద‌రు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడ‌ల్ విన్న‌ర్

త‌మ‌న్నాని అలా చూసి ఏడ్చేసిన ద‌ర్శ‌కుడి కూతురు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement