e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News చీర‌లు అంటే చాలా ఇష్ట‌మే.. కానీ అదొక్క‌టే స‌మ‌స్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేశ్‌

చీర‌లు అంటే చాలా ఇష్ట‌మే.. కానీ అదొక్క‌టే స‌మ‌స్య అంటున్న ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేశ్‌

పేరులోనే నటనను దాచుకున్న భామ.. నభా నటేశ్‌. తెలుగులో తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో సూపర్‌ హిట్‌ కొట్టేసింది. కన్నడసీమలో పుట్టిన నభా తెలుగు తెరపై వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా ఆమె నటించిన ‘మాస్ట్రో’ ఓటీటీలోస్ట్రీమింగ్‌ అవుతున్నది. ఈ సందర్భంగా ఇస్మార్ట్‌ భామ పంచుకున్న కబుర్లు..

ఇంజినీరింగ్‌ చదివినా, చిన్నప్పటి నుంచీ నాకు రకరకాల అభిరుచులు ఉండేవి. ముఖ్యంగా డ్యాన్స్‌, యాక్టింగ్‌ అంటే ఆసక్తి. కంప్యూటర్‌ ముందు కూర్చోవడంలో ఎలాంటి సంతృప్తీ దొరికేది కాదు. డ్యాన్స్‌ అనగానే హృదయం స్పందించేది. అందుకు తగ్గట్టే మా అమ్మ నన్ను ఎంతో ప్రోత్సహించేది. తన వల్లే మోడలింగ్‌, థియేటర్‌ ఆర్ట్స్‌ ప్రయత్నించాను. మోడలింగ్‌ కంటే యాక్టింగ్‌ బాగా నచ్చింది. ఎవరో డిజైన్‌ చేసిన దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవటంలో పెద్దగా కిక్‌ కనిపించలేదు. నాటకాలకు వచ్చాక చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అప్పుడే, యాక్టింగే నా కెరీర్‌ అని
నిర్ణయించుకున్నా.

- Advertisement -

వర్కవుట్స్‌ చేయడం నావల్ల కాదు. మహా అయితే వారంలో నాలుగు గంటలు చేస్తానేమో! డైట్‌ విషయంలో మాత్రం స్ట్రిక్ట్‌గా ఉంటా. నా ఆహారపు అలవాట్లే నా ఆరోగ్య రహస్యం. సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ అంటే ప్రాణం. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీలు ఉండాల్సిందే. సాంబార్‌ రైస్‌, బిర్యానీ వీకెండ్స్‌లో తినాల్సిందే.

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న రోజులు నా జీవితంలో మరపురానివి. స్టేజ్‌ మీదికి వెళ్లగానే ఏదో ఆవహించినట్టు అయిపోయేది. నాటకాలే నాలోని నటిని తీర్చిదిద్దాయని చెప్పగలను. టైమింగ్‌, బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌.. అన్నీ స్టేజ్‌ మీదే నేర్చుకున్నా. రంగస్థలం నా యాక్టింగ్‌ స్కూల్‌. హావభావాలను మరింత స్పష్టంగా వ్యక్తం చేయడానికి క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నా! మనం ధరించే పాత్రను పూర్తిగా అర్థం చేసుకోవాలన్న పాఠం కూడా రంగస్థలం నేర్పిందే. ఇప్పటికీ ఆ సూత్రాన్నే ఫాలో అవుతా. స్క్రిప్ట్‌ వింటున్నప్పుడే నా పాత్రను ఊహించుకుంటా. దీంతో పాత్ర స్వభావం, తీరుతెన్నులపై క్లారిటీ వచ్చేస్తుంది. కానీ, కొన్ని పాత్రలు ఇందుకు మినహాయింపు. ఇస్మార్ట్‌ శంకర్‌లో చాందిని పాత్ర చాలెంజింగ్‌గా అనిపించింది. చాలా అగ్రెసివ్‌ క్యారెక్టర్‌ అది. లాంగ్వేజ్‌ కూడా డిఫరెంట్‌. ఆ రోల్‌ చేయడానికి నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది. దానికి తగ్గ ఫలితమూ వచ్చింది.

చీరకట్టు నాకు బాగా నచ్చుతుంది. ఎనిమిదేండ్లు ఉన్నప్పుడు అనుకుంటా, అమ్మ చీరలు కట్టుకునేదాన్ని. కాలేజీ రోజుల్లో ‘ట్రెడిషనల్‌ డే’ సందర్భంగా చీర కట్టుకున్నా. కానీ, కట్టుకోవడానికే మూడు గంటలు పట్టింది. ‘ఎలాంటి చీరలంటే ఇష్టం?’ అని చాలామంది అడుగుతూ ఉంటారు. నాకు లైట్‌ వెయిట్‌ శారీస్‌ నచ్చుతాయి. అలాంటి చీరలు కట్టుకున్నప్పుడు పెద్దగా కష్టం ఉండదు. కంచిపట్టు అన్నా ఇష్టమే! కానీ, కట్టుకోవడమే కష్టం. ఎవరైనా సాయం చేయాల్సిందే. అంతేకాదు, పట్టు చీరకట్టులో ఉన్నంత వరకు ఎవరో ఒకరు తోడు ఉండాల్సిందే! మామూలు సమయాల్లో టీషర్ట్‌, జీన్స్‌ ధరించడం కంఫర్ట్‌గా ఫీలవుతాను. నాకు అవే పర్‌ఫెక్ట్‌గా నప్పుతాయి.

పెయింటింగ్‌ నా హాబీ. చిన్నప్పటి నుంచీ బొమ్మలు గీసేదాన్ని. ఏదైనా గీసినప్పుడు నా మనసులోని ఆలోచనలన్నీ రిఫ్రెష్‌ అవుతాయి. కళాత్మకంగా ఆలోచించే శక్తి వస్తుంది. నటిగా బిజీ కావడంతో పెయింటింగ్‌ పక్కన పెట్టాల్సి వస్తున్నది. లాక్‌డౌన్‌లో మాత్రం మళ్లీ నా కుంచెకు పని చెప్పాను. చాలా బొమ్మలు గీశాను. సెకండ్‌ లాక్‌డౌన్‌ టైమ్‌లో కాస్త ఇబ్బందిగా ఫీలయ్యా. కరోనా కేసులు, మరణాలు పెరగడం బాధనిపించింది. కొద్దిరోజుల ముందే రెండు సినిమాలు రిలీజైనా కూడా, ఇదీ అని చెప్పలేని అభద్రతా భావానికి లోనయ్యా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Siri: సిరి ష‌ర్ట్ లోప‌ల చేయి పెట్టిందెవ‌రు.. వీడియో చూపించి గుట్టు విప్పిన‌ నాగ్

MAA Elections 2021 : ఎట్ట‌కేల‌కు మా అధ్య‌క్ష ఎన్నిక‌ల తేదీలు ఖ‌రారు.. మ‌రి కండిష‌న్స్ ఏంటో తెలుసా !

Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!

Idol Winner: ఇద్ద‌రు భార్య‌లు,ఇద్ద‌రు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడ‌ల్ విన్న‌ర్

త‌మ‌న్నాని అలా చూసి ఏడ్చేసిన ద‌ర్శ‌కుడి కూతురు..!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement