MAA Elections 2021 : ఎట్టకేలకు మా అధ్యక్ష ఎన్నికల తేదీలు ఖరారు.. మరి కండిషన్స్ ఏంటో తెలుసా !

maa elections 2021 | ఎట్టకేలకు మా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారైంది. అక్టోబర్ 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మా ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ రోడ్ నం. 71లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఈ ఎన్నికలకు ఏర్పాట్లు చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు జరిపి.. రాత్రి 7 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే గ్రూపులుగా విడిపోయి, ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా టాలీవుడ్లో, మా లో విందు రాజకీయాలు నడుస్తున్నాయని ఈ మధ్య పెద్ద దుమారమే సాగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. వీరిలో ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ సభ్యులను ప్రకటించేశారు. మంచు విష్ణు ప్యానెల్‌కు సంబంధించి రఘుబాబు, బాబు మోహన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే విష్ణు పూర్తి ప్యానెల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ మా ఎన్నికల షెడ్యూల్
- సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ
- సెప్టెంబర్ 30న నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 2 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు
- అక్టోబర్ 2న సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా ప్రకటన
- అక్టోబర్ 10న ఎన్నికలు, అదే రోజు ఫలితాల వెల్లడి
కండిషన్స్
- ఒక అభ్యర్థి ఒక పోస్టు కోసం మాత్రమే పోటీ చేయాలి.
- గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి.. 50 శాతం కంటే తక్కువ మీటింగ్‌లకు హాజరైతే పోటీకి అనర్హులు.
- 24 క్రాఫ్ట్స్‌లో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు మా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ పదవులకు రాజీనామా చేయాలి.
- అందరూ కచ్చితంగా కరోనా మార్గదర్శకాలను పాటించాలి. నామినేషన్ సమర్పణ, ఓటింగ్ సమయంలో మాస్కు తప్పనిసరిగా ఉండాలి
- సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం
- పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

