Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్

బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో యాంకర్ రవి, కాజల్ రిపోర్టర్స్‌గా మారి సందడి చేశారు. ఇది వారికి కొట్టిన పిండే కాబట్టి ఒక్కో కంటెస్టెంట్ దగ్గరకు వెళ్లి నానా రచ్చ చేశారు. ముందుగా మీకు పెళ్లి కాకపోయి ఉంటే ఎవరికి లైన్ వేసే వాళ్లు అని కాజల్.. రవిని ప్రశ్నించగా ఆయన తెలివిగా కాజల్ పేరు చెప్పాడు.ఇక అనీ మాస్టర్.. తనకు హౌస్‌లో పెద్ద కూతురు దొరికిందంటూ శ్వేత గురించి చెప్పింది.
ఇక హౌజ్‌లో ట్రాక్స్ గురించి చెప్పమంటే శ్రీరామ్, సన్నీ, హమీదా మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అని అనిపిస్తుందని అని మాస్టర్ చెప్పుకొచ్చింది. ఐడల్ విన్నర్ శ్రీరామచంద్ర తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఫస్ట్ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత లహరి మీద, ఇప్పుడు ప్రియ మీద లవ్ స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చాడు.
ఇంట్లో ఉన్నవాళ్లలో భార్య, గర్ల్‌ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, పని మనిషిగా ఎవరు సెట్ అనుకుంటున్నారో చెప్పమని రవి ప్రశ్నించగా, అందుకు సమాధానం ఇచ్చిన శ్రీరామ్ …లహరి, ప్రియ భార్యగా, సిరి, హమీదా గర్ల్‌ఫ్రెండ్స్‌గా, శ్వేత బెస్ట్ ఫ్రెండ్‌గా, కాజల్ పని మనిషిగా ఉంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. కాజల్ పనిమనిషి అనే సరికి ఆమె ముఖం వాడిపోయినట్టు అయింది.
ఇక మిగతా వారిని కూడా వీరు ప్రశ్నించారు. ఇందులో భాగంగా మానస్.. సిరి బెస్ట్‌ఫ్రెండ్, ప్రియాంక మరదలు, హమీదా ప్రేయసి, లహరి భార్య అయితే బాగుంటుందన్నాడు. సన్నీ.. శ్వేతను భార్యగా, హమీదాను గర్ల్‌ఫ్రెండ్‌గా, సిరిని పనిమనిషిగా సెలక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత జెస్సీ.. సిరిని గర్ల్‌ఫ్రెండ్‌గా, కాజల్‌ను పని మనిషిగా ఎంచుకున్నాడు. ఇక హమీదాని.. శ్రీరామ్, షణ్ముఖ్లలో ఎవరు బెస్ట్ అని ప్రశ్నించగా అందుకు శ్రీరామ్ అని సమాధానం చెప్పింది. అంతేకాక ఆయనతో రొమాంటిక్‌గా డ్యాన్స్ కూడా చేసి మెప్పించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- anchor ravi
- bigg boss
- season 5
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

