Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 5లో గొడవలు కామన్‌గా మారాయి. ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరు గొడవలు పడుతూనే ఉన్నారు. శుక్రవారం రోజు జరిగిన ఎపిసోడ్ మొదట్లో జెస్సీ.. శ్వేతని తెగ నవ్వించాడు. హౌజ్‌మేట్స్‌ని అనుకరిస్తూ ఆమెని ఫుల్ నవ్వించాడు. ఇక అనంతరం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఈ టాస్క్ ప్రకారం స్క్రీన్‌పై కనిపించిన పేరు ఉన్నవారు గార్డెన్ ఏరియాలో పై నుండి పడుతున్న బంతిని పట్టుకోవలసి ఉంటుంది. బాల్‌పై ఏ ఐటమ్ అయితే రాసి ఉంటుందో అది హౌజ్‌మేట్స్‌కి దక్కుతుంది. టాస్క్ స్టార్ట్ అవగానే ముందు విశ్వ పేరు వచ్చింది. దీంతో ఆయన ఉరుక్కుంటూ వెళ్లాడు. కాని బాల్ పట్టుకోలేకపోయాడు. లహరి, లోబో, సిరి.. మిస్ చేశారు.
నటరాజ్ మాస్టర్, ప్రియాంక మాత్రం బాల్ క్యాచ్ చేసి ఇంట్లో వాళ్లకు ఫుడ్ దొరికేలా చేశారు. అనంతరం బిగ్‌బాస్ ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో బెస్ట్, వరస్ట్ పర్ఫామర్ పేర్లను ఎంచుకోమన్నాడు. దీంతో విశ్వ, హమీదా.. షణ్ముఖ్‌ను; శ్రీరామచంద్ర, మానస్, సన్నీ, యాంకర్ రవి, లోబో.. నటరాజ్ మాస్టర్‌ను; లహరి, షణ్ముఖ్.. మానస్‌ను; ప్రియ, సిరి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్.. శ్రీరామచంద్రను; ఉమాదేవి, శ్వేత వర్మ.. జెస్సీని బెస్ట్ పర్ఫామర్లుగా పేర్కొన్నారు. ఎక్కువ ఓట్లు సాధించిన నటరాజ్ మాస్టర్ ఈ వారం బెస్ట్ పర్ఫామర్‌గా ఎంపికయ్యాడు.
ఎక్కువ మంది సన్నీని వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపిక చేయడంతో అతన్ని జైలుకి పంపారు గత వారం జెస్సీ వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపికై జైలుకి వెళ్లగా ఈ సారి సన్నీ వెళ్లాల్సి వచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

