e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News Bigg Boss: కాజ‌ల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ‌..ఎందుకో తెలుసా?

Bigg Boss: కాజ‌ల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ‌..ఎందుకో తెలుసా?

గ‌త వారం వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా ఎంపికైన జెస్సీని బిగ్ బాస్ జైలుకి పంప‌గా, ఈ వారం స‌న్నీని జైలులో ఉంచాల‌ని ఆదేశాలు ఇచ్చాడు. అయితే వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా కంటెస్టెంట్స్ కొంద‌రు పేర్లు చెప్పే క్ర‌మంలో విశ్వ‌.. ప్రియాంక లేటుగా రెడీ అయి వ‌స్తుంది, అందుకే త‌న‌ని వ‌ర‌స్ట్ ప‌ర్ఫార్మ‌ర్‌గా ఎంపిక చేస్తున్నాను అని అన్నాడు.దానిని ప్రియాంక అస్స‌లు ఒప్పుకోలేదు. ఏ రోజు అలా జ‌ర‌గ‌లేద‌ని ఖండించింది.

ఇక ఖాళీ స‌మ‌యంలో కాజ‌ల్, ప్రియ ఓ చోట కూర్చోని కిచెన్ విష‌యాల‌పై మాట్లాడుకున్నారు. కూల్‌గా మాట్లాడుదామ‌ని కాజ‌ల్ ప్ర‌య‌త్నించ‌గా, అది పెద్ద గొడ‌వ‌గా మారింది. సెక‌నుకో మాట మాట్లాడ‌తావు, సంస్కారం ఉంటే అలా మాట్లాడ‌వు.. అబద్దాన్ని కూడా ఎంతో నిక్కచ్చిగా చెబుతావు.. దారుణంగా ఉన్నావు.. అమ్మో దండం నీకు.. ఇలా ఏవేవో మాట‌లు కాజ‌ల్‌ని అనేసింది ప్రియ. దీంతో ఆమె ఏడ్చుకుంటూ బెడ్ రూంకి వెళ్లింది. ర‌వి ఓదార్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా, అక్క‌డికి వ‌చ్చిన ప్రియ కాజ‌ల్‌కి సారీ చెప్పింది.

- Advertisement -

ఇక మ‌ధ్య మ‌ధ్య‌లో బిగ్ బాస్ సైర‌న్ ఇస్తూ ల‌గ్జ‌రీబ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మేట్స్‌ని తెగ ఉరుకులు పెట్టించారు. ఇదంతా జైల్లో ఉన్న స‌న్నీ చూస్తూ సంతోషించాడు. మ‌రోవైపు అత‌ను జైలుకి వెళ్లిన కార‌ణంగా కొంద‌రు హౌజ్‌మేట్స్ అత‌ని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement