Siri: సిరి షర్ట్ లోపల చేయి పెట్టిందెవరు.. వీడియో చూపించి గుట్టు విప్పిన నాగ్

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌మేట్స్‌కి ఓ టాస్క్ ఇవ్వగా, ఆ టాస్క్‌లో సన్నీ.. తన షర్ట్ లోపల చేయి పెట్టాడని సిరి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. హౌజ్‌మేట్స్ అందరు కూడా అది నిజమని భావించారు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా సిరి షర్ట్‌లో నుండి చేయి బయటకురాగా, అది సన్నీదే అని కన్ఫాం అయిపోయారు. దీనిపై శనివారం ఆసక్తికర చర్చ నడిచింది.
నాగ్.. సిరి వైపు చూస్తూ.. సన్నీ నీ షర్ట్ లోపల చేయి పెట్టి బెటాన్ తీశాడా? అని ప్రశ్నించాడు. అందుకామె అవునని చెప్పింది. మరింత క్లారిటీ కోసం షణ్ముఖ్‌ను అడగ్గా అతడు కూడా సన్నీ చేయి పెట్టాడు అని పేర్కొన్నాడు. దీంతో నాగ్.. స్లో మోషన్ వీడియో క్లిప్ చూపించాడు. అందులో సిరి షర్ట్ లోపల చేయి పెట్టింది శ్వేతాది అని అర్ధమైంది.దీంతో అందరి అనుమానాలు తీరాయి.
సన్నీ చాలా కూల్ అయ్యాడు. సిరి కూడా అతడికి సారీ చెప్పి హగ్గిచ్చింది. ఇంకెప్పుడు నిజం తెలుసుకోకుండా వారి క్యారెక్టర్ని బ్యాడ్ చేయోద్దని చెప్పాడు నాగార్జున. ఇక నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ప్రియాంక, అనీ మాస్టర్, లోబో సేఫ్ అయినట్టు తెలియజేశాడు.
సాయిధరమ్ ఆరోగ్యంపై నోరు విప్పిన రామ్ చరణ్
బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చిన రామ్ చరణ్‌తో నాగ్ సరదగా ఎంటర్టైన్ చేశాడు. ప్రమోషన్ వీడియో బాగుందని చెప్పాక, సాయి ధరమ్ ఆరోగ్యం గురించి ఆరా తీసాడు. చాలా క్షేమంగా ఉన్నాడు. ఎలాంటి రిస్క్ లేదు. మరి కొద్ది రోజులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు అని చెప్పాడు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. కాగా, రీసెంట్గా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తేజూకి వెంటిలేటర్ తొలగించినట్టు చెప్పారు వైద్యులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

